న్యూయర్క్: చాలా మంది ప్రకృతి ప్రేమికులు పర్వతాలు, అడవులు గుండా సుదీర్ఘ ప్రయాణం కాలినడకన(ట్రెక్కింగ్) చేస్తుంటారు. పైగా ఆ ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎటువంటి ఆపదల ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలతో పయనమవుతారు. ఏదైనా సమస్య ఎదురైతే రెస్య్కూ సిబ్బంది సాయంతో సురక్షితంగా బయటపడతారు. అయితే ఇలానే ఒక వ్యక్తి అమెరికాలోని కొలరాడోలోని మౌంట్ ఎల్బర్ట్ అనే పర్వతం గుండా సుదీర్ఘ ప్రయాణ నిమిత్తం ఉదయం 8 గంటలకు కాలినడకన పయనమయ్యాడు.
(చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!)
ఈ మేరకు అతను ఎంతసేపటికి రాకపోయేసరికి లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ (ఎల్‌సీఎస్‌ఏఆరర్) అతను గల్లంతైనట్లు గుర్తించి ఆ వ్యక్తి ఆచూకి నిమిత్తం ఐదుగురి రెస్కూ సిబందిని పంపించింది. ఈ క్రమలో ఆ సిబ్బంది అతని ఫోన్ కాల్‌ని ట్రేస్ చేయడానికి ప్రయత్నించటానికీ చూశారు. కానీ అతను గుర్తు తెలియని నంబర్ నుంచి వస్తున్న కాల్స్‌ని రిసీవ్ చేసుకోకవపోవడంతో సిబ్బంది అతన్ని గాలించలేకపోయారు. దీంతో వారు వెనుకకు వచ్చి మరో ప్రాంతం గుండా గాలించడం మొదలు పెట్టారు.
ఎట్టకేలకు ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయమే తను బస చేస్తున్న హోటల్‌కి సురక్షితంగా రావడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైగా రెస్క్యూ టీమ్ తన కోసం వెతుకుతున్నట్లు అతనికి తెలియదు. దీంతో ఎల్‌సీఎస్‌ఏఆర్ దయచేసి ప్రయాణ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికి గమ్యానికి తిరిగి చేరుకోలేనప్పుడు మీ ఆచూకి నిమిత్తం రెస్క్యూ బృందం వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోండి అని నొక్కి చెప్పింది. ఈ మేరకు దయచేసి పదేపదే తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్స్‌కి సమాధానం ఇవ్వండంటూ ప్రయాణికులకు లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ విజ్ఞప్తి చేసింది.
(చదవండి: బాబోయ్ ముఖం అంతా టాటులే!)
Comments
Please login to add a commentAdd a comment