
అచ్చం సినిమాల్లో మాదిరిగానే..!
బెర్న్: సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని సన్నివేశాలు నిజంగా జరిగితే ఎలా ఉంటుంది. స్విజర్లాండ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం హాలివుడ్ చిత్రాలు.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, ఇటాలియన్ జాబ్లలోని సన్నివేశాలను తలపించింది. కొండపైన ఉన్న రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొని, అంతటితో ఆగకుండా కిందకు వచ్చి.. ముందు చక్రాలు గాల్లో తేలేలా ఎవరో ఆపినట్లు ఆగింది.
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలంలో ట్రాక్టర్ను చూసి షాక్ తీన్నారు. ట్రాక్టర్ ఏమాత్రం ముందుకు కదిలినా కింద ఉన్న రోడ్డుపై పడిపోయే ప్రమాదం ఉండటంతో క్రేన్ సహాయంతో జాగ్రత్తగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ట్రాక్టర్ డ్రైవర్ను రక్షించారు. గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నాడు.