
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
మృతదేహాలు కాలిపోవడంతో వారిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. అయితే వారి నేషనల్ ఐడీలు లభించడంతో వీరంతా మెక్సికన్లే అని ధ్రువీకరించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడా లేదా పరారయ్యాడా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కూడా ఘటన స్థలంలో లేదని వెల్లడించారు.
చదవండి: నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
Comments
Please login to add a commentAdd a comment