caught fire
-
బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
ఆధునిక కాలంలో కొత్త కార్లను కొనుగోలు చేసేవారిలో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకుంటున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. కానీ అక్కడక్కడా.. అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గతంలో ఓలా, ప్యూర్ ఈవీ, ఏథర్ కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఛార్జింగ్ పెట్టిన సమయంలో కొన్ని కారణాల వల్ల మంటల్లో చిక్కుకున్నాయి. ఈ సంఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో కేంద్రం సంబంధిత సంస్థలు దీనికి కారణాలను వెల్లడించాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని హెచ్చరించింది. అయితే ఈ రోజు బెంగళూరులో ఒక ఎలక్ట్రిక్ కారు కాలిపోయింది. నివేదికల ప్రకారం, శనివారం బెంగళూరు జెపి నగర్ ప్రాంతంలోని దాల్మియా సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మహీంద్రా e20 లాగా ఉందని కొందరు, ఎంజి కామెట్ మాదిరిగా ఉందని కొందరు చెబుతున్నారు. కానీ చాలామంది ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ కారు అని అభిప్రాయపడుతున్నారు. నది రోడ్డు మీద కాలిపోతున్న ఎలక్ట్రిక్ కారుని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇందులో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ సంఘటనలో ఎవరికైనా ప్రమాదం జరిగిందా.. లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. కానీ ఇందులో ఎవరికీ ప్రమాదం జరగలేదనే భావిస్తున్నాము. #Bengaluru: An #electric #car caught #fire near Dalmia Circle in #JPNagar area today. No casualties. Reason is yet to be ascertained.#Karnataka #EV #ElectricVehicles #india pic.twitter.com/z7rVVxgJSn — Siraj Noorani (@sirajnoorani) September 30, 2023 -
రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, నల్గొండ జిల్లా: తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. నార్కెట్‌పల్లి అద్దంకి రహదారిపై కృష్ణాపురం వద్ద ఘటన జరిగింది. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులోని 26 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు వేమూరి-కావేరి ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా బస్సు వెనుక టైర్ పేలడంతో రాపిడికి గురవడంతో ఘటన జరిగింది. చదవండి: గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు -
బాలానగర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై కాసేపు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. -
ట్రాక్టర్, వ్యాను ఢీ.. చెలరేగిన మంటలు.. 26 మంది సజీవదహనం
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. మృతదేహాలు కాలిపోవడంతో వారిని అధికారులు గుర్తించలేకపోతున్నారు. అయితే వారి నేషనల్ ఐడీలు లభించడంతో వీరంతా మెక్సికన్లే అని ధ్రువీకరించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడా లేదా పరారయ్యాడా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. ట్రాక్టర్ కూడా ఘటన స్థలంలో లేదని వెల్లడించారు. చదవండి: నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో.. -
ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు
ముంబై: ఎన్సీసీ ఎంపీ సుప్రియా సూలేకు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర పుణెలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె చీరకు నిప్పంటుకుంది. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తుండగా.. అక్కడున్న దీపం ఆమె చీరకు అంటుకుని మంట వచ్చింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. మంటను వెంటనే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. పుణెలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. सुप्रिया की साड़ी में लगी आग पुणे में एक कार्यक्रम के दौरान एनसीपी नेता और सांसद सुप्रिया सुले जब शिवाजी की प्रतिमा पर हार चढ़ा रही थी तो उनकी साड़ी दिए कि लौ के बीच आ गयी और साड़ी में आग पकड़ लग गयी फिलहाल सुप्रिया सुरक्षित है pic.twitter.com/juGQjkTswO — Rajiv Singh (@indiatvrajiv) January 15, 2023 చదవండి: రాష్ట్రపతి ముర్ము ఆశీస్సుల కోసం ప్రయత్నించింది.. విషయం తెలియక సస్పెన్షన్‌కు గురైంది! -
ఇండిగో విమానంలో చెలరేగిన మంటలు.. వీడియో వైరల్..
సాక్షి,న్యూఢిల్లీ: ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో మంటలు చెలరేగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయెల్దేరినప్పుడు శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇంజిన్ నుంచి మంటలు రావడం చూసి విమానంలోని వారంతా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే ఫ్లయిట్‌ను అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు. శుక్రవారం రాత్రి 9:45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రన్‌వేపై మరో ఐదారు సెకన్లలో ఫ్లయిట్ టేకాఫ్ అవుతుందనగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఘటన సమయంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. అయితే తాము 11 గంటల వరకు కిందకు దిగలేదని, విమానంలోని సిబ్బంది తమకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. ఇండిగో సంస్థ అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయాణికులందరినీ మరో విమానంలో బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. #Delhi - #Bengaluru flight incident Passengers evacuated after fire in #IndigoFlightFire aircraft at IGI Airport’s runway; DGCA orders probehttps://t.co/64FdY0F98f pic.twitter.com/3liUcGtojt — Kiran Parashar (@KiranParashar21) October 29, 2022 ఇండిగో విమానాల్లో ఇప్పటికే పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేషన్ విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టింది. చదవండి: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్! -
సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహనం పేలి ఇల్లు దగ్దం
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికిల్స్ కాలిపోవడమే కాకుండా వ్యక్తులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ ఘటనలు పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్‌పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్దమైంది. దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇంటి ముందు చార్జింగ్‌లో పెట్టాడు. అయితే అనూహ్యంగా బైక్ బ్యాటరీ పేలడంతో ఇల్లు పూర్తి కాలి దగ్దమైంది. చదవండి: ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది! -
ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12 మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
కారులో మంటలు
-
క్షణాల్లో కారు దగ్ధం...తృటిలో బయటపడ్డారు..
సాక్షి, నిడమానూరు : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద హైవేపై బుధవారం ఉదయం ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్నవారు ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి పాలకొల్లు వెళుతున్న ఐ-టెన్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారును డ్రైవ్ చేస్తున్న మల్లాది నరసింహ శాస్త్రి మంటలను గమనించి వెంటనే వాహనాన్ని పక్కకు తీశారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా దిగగానే మంటలు ఒక్కసారిగా చెలరేగి, క్షణాల్లో కారు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న నరసింహ శాస్త్రి పాలకొల్లులోని తమ బంధువులు ఇంటికి కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోవడంపై అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అందాలు ఆరబోద్దామనే అత్యుత్సాహంలో..
-
అందాలు ఆరబోద్దామనే అత్యుత్సాహంలో..
ఓ మోడల్ అత్యుత్సాహం ప్రాణం మీదకు తెచ్చింది. తాను ధరించిన వినూత్న వస్త్రాలను ప్రదర్శించేందుకు ర్యాంప్‌పై ముందుకెళ్లిన మోడల్ అలంకరణకు నిప్పు అంటుకోవడంతో క్షణాల్లో భయానక వాతావరణం అలుముకుంది. కళ్లుమూసి తెరిచేలోగా మంటలు ఆమె తలపై డిజైన్ చేసిన ప్రత్యేక అలంకరణను కాలి బూడిదైంది. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పడంతో ఆమె స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటన ఎవన్ సాల్వడోర్లో చోటుచేసుకుంది. ర్యాంప్ చివర్లో చేతిలో దివిటీలతో కొంతమంది వ్యక్తులను ఆకర్షణగా పెట్టడంతో వారి చేతుల్లోని నిప్పు కాస్త ఆమె డిజైన్‌కు అంటుకోవడంతో ఆ ప్రమాదం సంభవించింది. ఆ వీడియోను మీరు కూడా వీక్షించండి. -
కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు!
-
పలమనేరులో ముగ్గురు సజీవ దహనం