సాక్షి,న్యూఢిల్లీ: ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో మంటలు చెలరేగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయెల్దేరినప్పుడు శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇంజిన్ నుంచి మంటలు రావడం చూసి విమానంలోని వారంతా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే ఫ్లయిట్‌ను అత్యవసరంగా ఢిల్లీ విమానాశ్రయంలోనే ల్యాండ్ చేశారు.
శుక్రవారం రాత్రి 9:45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రన్‌వేపై మరో ఐదారు సెకన్లలో ఫ్లయిట్ టేకాఫ్ అవుతుందనగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. ఘటన సమయంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. అయితే తాము 11 గంటల వరకు కిందకు దిగలేదని, విమానంలోని సిబ్బంది తమకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. ఇండిగో సంస్థ అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయాణికులందరినీ మరో విమానంలో బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది.
#Delhi - #Bengaluru flight incident
— Kiran Parashar (@KiranParashar21) October 29, 2022
Passengers evacuated after fire in #IndigoFlightFire aircraft at IGI Airport’s runway; DGCA orders probehttps://t.co/64FdY0F98f pic.twitter.com/3liUcGtojt
ఇండిగో విమానాల్లో ఇప్పటికే పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇంజిన్‌లో మంటలు చెలరేగడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేషన్ విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టింది.
చదవండి: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్‌లో యాడ్స్ బంద్!
Comments
Please login to add a commentAdd a comment