
గుడిహత్నూర్ మండలం మన్నుర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
సాక్షి, ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండలం మన్నుర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ను ఐచర్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టరు బోల్తా పడింది. ట్రాక్టర్‌లో ఉన్నా డ్రైవర్‌తో సహ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.