బెల్లంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : వేగంగా వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బొగ్గు గనుల్లో బొగ్గును పేల్చడానికి ఉపయోగించే పేలుడు పదార్థాల లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బెల్లంపల్లికే చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు.
వ్యాన్, బైక్ ఢీ : ఇద్దరి పరిస్థితి విషమం
Published Tue, Jul 7 2015 8:30 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement