కన్నడ నటుడు సుదీప్ తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. అనూప్ భండారి దర్శకత్వంలో జాన్ మంజునాథ్, శాలినీ మంజునాథ్ నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్ క్రియేట్ చేసిన సుదీప్ ‘విక్రాంత్ రోణ’తో సరికొత్తగా పరిచయం అవుతున్నారు.
బూర్జ్ ఖలీఫాలో ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం చుట్టారు. ఇండియన్ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టమిది. ఈ వేడుక కోసం 2000 అడుగుల ఎత్తున్న సుదీప్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ కటౌట్‌తో సుదీప్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్.
Comments
Please login to add a commentAdd a comment