Shah Rukh Khan Pathaan Movie Trailer lit Up Burj Khalifa In Dubai - Sakshi
Sakshi News home page

Pathaan Movie: బుర్జ్‌ఖలీఫాపై ‘పఠాన్‌’ ట్రైలర్.. అభిమానులతో షారుక్ సందడి

Jan 15 2023 5:12 PM | Updated on Jan 15 2023 6:32 PM

Shah Rukh Khan Pathaan Movie trailer lit up Burj Khalifa In Dubai - Sakshi

బాలీవుడ్‌ ‘బాద్‌షా’ షారుక్ ఖాన్‌, బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'పఠాన్‌'. ఎన్నో వివాదాల అనంతరం.. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు.  ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ను హిందీతో పాటు తెలుగు, తమిళంలో రిలీజ్ చేసింది చిత్రబృందం. 

తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాపై ప్రదర్శించారు. ఈ వేడుకలో పాల్గొన్న హీరో షారుక్ ఖాన్ అభిమానులతో కలిసి సందడి చేశారు. ట్రైలర్ ప్రదర్శించినప్పుడు ఆ ప్రాంతమంతా ఆయన అభిమానులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. షారుఖ్ ఖాన్ 'ఝూమ్ రే పఠాన్' అనే పాటకు డ్యాన్స్ చేశాడు. అంతకుముందు రణ్‌వీర్ సింగ్ నటించిన'83' ట్రైలర్‌ను బుర్జ్‌ఖలీఫాపై ప్రదర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement