ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అనగానే దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా గుర్తొస్తుంది ఎవరికైనా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో సహా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వాస్తవానికి నిర్మాణ శైలికి, ఇంజినీరింగ్ సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలిచే భవానాలకు నిలయం దుబాయ్. నగరంలోని సుదూర ప్రాంతాలనుంచి కూడా 160-అంతస్తుల టవర్‌ను ఈజీగా గుర్తు పట్టేయొచ్చు. మన దేశంలో కూడా బుర్జ్ ఖలీఫా అంటూ ఒక వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అదే బిహార్ బుర్జ్ ఖలీఫా. మరి ఈ ఇంట్రస్టింగ్ వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గన్నిపూర్ ప్రాంతంలో ఉంది ఈ భవనం. కేవలం ఆరడుగుల స్థలంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇంటి వెడల్పు కూడా ఐదు అడుగుల మాత్రమే.
క్యాండీమేన్ వ్లాగర్ ప్రకారం స్థానికులు ముచ్చటగా దీన్ని ఈఫిల్ టవర్ అని పిలుస్తుంటారట. అంతేకాదు 2015లో సంతోష్ అనే వ్యక్తి తన భార్యకు బహుమతిగా దీన్ని నిర్మించాడట. అందుకే దీన్ని ఐకానిక్ తాజ్ మహల్‌తో పోల్చాడు. పెళ్లి తరువాత భార్యతో కలిసి ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ ఇంత తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సౌకర్యాలతో భవనం నిర్మించాలనే ఆలోచనతో సంతోష్ ఓ ఇంజినీర్‌ను కలిసాడు. ఫలితంగా అద్భుతమై భవనాన్ని డిజైన్ చేసి ఇచ్చాడు ఇంజినీర్.
సమీప గ్రామాల ప్రజలు ఈ భవనాన్ని చూసేందుకు తరచూ వస్తుంటారట. దీంతో ఇది టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారిపోయిందంటూ ఈ భవనం విశేషాలు పంచుకున్నాడు ఈ వీడియోలో. ఇక దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇల్లు చాలా తక్కువ స్థలం ఉన్నప్పటికీ, వంటగది, బాత్రూమ్ పడకగదితో సహా అన్ని సౌకర్యాలను కలిగి ఉండే విధంగా దీన్ని నిర్మించారు. ఇది రెండు భాగాలుగా ఇంటి మొదటి భాగంలో మెట్లు , రెండో భాగంలో గదులు ఉంటాయి. ప్రస్తుతం ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చారు. కానీ దీని స్పెషల్ లుక్ చూసి అబ్బురపడుతూ ఉంటారట సందర్శకులు.
Comments
Please login to add a commentAdd a comment