బుర్జ్‌ ఖలీఫా: "నేను కూడా మీ అభిమానినే" | Dubai Burj Khalifa honours superstar Shah Rukh Khan birthday | Sakshi
Sakshi News home page

అత్యంత ఎతైన భవనం పై ఇలా కనిపించడం మూడోసారి

Published Wed, Nov 3 2021 3:21 PM | Last Updated on Wed, Nov 3 2021 4:31 PM

Dubai Burj Khalifa honours superstar Shah Rukh Khan birthday - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూఖ్ ఖాన్ పుట్టినరోజు నవంబర్‌ 2 పురస్కరించుకుని దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా బాలీవుడ్ సూపర్‌స్టార్‌కు 'హ్యాపీ బర్త్‌డే' శుభాకాంక్షలు తెలుపుతూ అతని చిత్రాన్ని ప్రదర్శించి సత్కరించింది.

(చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!)

ఆ తర్వాత ఆకాశహర్మ్యంపై 'హ్యాపీ బర్త్‌డే షారూఖ్' అనే సందేశాన్ని తోపాటు  " మేము నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ ఒక లవ్‌ సింబల్‌ కనిపిస్తుంది. ఈ విధంగా షారూఖ్ ఖాన్ బుర్జ్ ఖలీఫా భవనంపై కనిపించడం మూడోసారి.

అయితే దీనికి సంబంధించిన వీడియోతో పాటుగా "ఈ భవనం నీ కోసం మెరుస్తుంది" అనే క్యాప్షన్‌ జోడించి మరీ వ్యాపారవేత్త మొహమ్మద్ అలబ్బర్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. ఈ మేరకు నెటిజన్లు మనందరిలాగే బుర్జ్ ఖలీఫా కూడా షారుఖ్‌ ఖాన్‌ని ప్రేమిస్తుంది అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement