
దుబాయ్: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. కింగ్‌ఖాన్ బర్త్‌డే సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఆయన పేరును ప్రదర్శించారు. కింగ్ ఆఫ్ బాలీవుడ్ షారూఖ్‌ఖాన్ హ్యాపీ బర్త్‌డే అనే సందేశం బుర్జ్ ఖలీఫాపై ప్రత్యక్షం కాగానే ఆయన అభిమానులు ఆనందంతో పులకరించిపోయారు. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన బుర్జ్ ఖలీఫాపై ఓ నటుడి పేరు ప్రదర్శించడం ఇదే తొలిసారి. షారుఖ్ ఖాన్ శనివారం 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.