యాక్షన్‌ ఇన్‌ బూర్జ్‌ ఖలీఫా | Shah Rukh Khan Pathan to be shot inside Burj Khalifa | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఇన్‌ బూర్జ్‌ ఖలీఫా

Published Tue, Feb 2 2021 1:29 AM | Last Updated on Tue, Feb 2 2021 1:29 AM

Shah Rukh Khan Pathan to be shot inside Burj Khalifa - Sakshi

రెండేళ్ల విరామం తర్వాత షారుక్‌ ఖాన్‌ చేస్తున్న చిత్రం ‘పతాన్‌’. ఇందులో దీపికా పదుకోన్‌ కథానాయిక. జాన్‌ అబ్రహామ్‌ విలన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బూర్జ్‌ ఖలీఫాలో ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట ‘పతాన్‌’ చిత్రబృందం. బూర్జ్‌ ఖలీఫాలో చిత్రీకరణ జరుపుకోనున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘మిషన్‌ ఇంపాజిబుల్, ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియస్‌’ వంటి హాలీవుడ్‌ సినిమాలను ఈ భవనంలో చిత్రీకరించారు. ‘పతాన్‌’ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement