Shahrukh Khan Pathan Shooting Leaks | పఠాన్.. అదుర్స్ అంటున్న షారుఖ్‌ ఫ్యాన్స్ - Sakshi
Sakshi News home page

పఠాన్.. అదుర్స్ అంటున్న షారుఖ్‌ ఫ్యాన్స్

Published Sat, Mar 13 2021 12:06 PM | Last Updated on Sat, Mar 13 2021 2:03 PM

Shahrukh Khan Action Avatar In Pathan Movie - Sakshi

ముంబై గ్యాంగ్‌స్టర్ల బెండు తీస్తున్నాడు ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్‌’. దీపికా పదుకోన్‌  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్‌ అబ్రహాం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్‌  సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ కారుపైకి ఎక్కి షారుక్‌ ఫైట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసిన షారుక్‌ ఫ్యాన్స్‌‘పఠాన్‌ ..అదుర్స్‌’ అని కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.

అయితే ఈ వీడియోలు కొత్తవా? పాతవా? అనే విషయంపై సరైన స్పష్టత లేదు. ఎందుకుంటే గత నెల దుబాయ్‌ లొకేషన్‌లో ‘పఠాన్‌ ’ సినిమా షూటింగ్‌ జరిగింది. అక్కడ కొన్ని యాక్షన్‌ సీన్స్‌ తీశారు. ఆ వీడియోలే ఇప్పుడు ప్రచారంలోకొచ్చాయి అంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ వీడియోలు ఎప్పటివి అనేది పక్కనపెడితే... ‘పఠాన్‌ ’ సినిమాలో యాక్షన్‌  సీన్స్‌ మాత్రం అదిరిపోయేలా ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement