రెండేళ్ల తర్వాత మేకప్‌ | Shah Rukh Khan to start shooting Pathan with Deepika Padukone | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత మేకప్‌

Published Thu, Nov 19 2020 5:40 AM | Last Updated on Thu, Nov 19 2020 5:40 AM

Shah Rukh Khan to start shooting Pathan with Deepika Padukone - Sakshi

షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘జీరో’ చిత్రం విడుదలై రెండేళ్లయింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. సున్నాకి సున్నా అని కొంతమంది జోకులు కూడా వేశారు. ఈ సినిమాకి ముందు షారుక్‌ చేసిన ‘జబ్‌ హ్యరీ మెట్‌ సెజల్‌’ కూడా అంతగా ఆడలేదు. దాంతో షారుక్‌ డైలమాలో పడ్డారు. ఇక లాభం లేదు.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తపడాలనుకున్నారు. 2018 డిసెంబర్‌లో ‘జీరో’ విడుదలైంది. ఆ తర్వాత ఏడాది పాటు కథలు విన్నారు షారుక్‌. అయినా ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈలోపు ఈ ఏడాది కోవిడ్‌ బ్రేక్‌ వచ్చింది.

ఈ బ్రేక్‌ లో బాగా ఆలోచించుకుని, ‘పఠాన్‌’ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు షారుక్‌. రెండేళ్ల తర్వాత హీరోగా మేకప్‌ వేసుకుని, బుధవారం ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో దీపికా పదుకోన్, జాన్‌ అబ్రహాం నటిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్‌’ చిత్రదర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ అని టాక్‌. మరి.. పరాజయాల్లో ఉన్న షారుక్‌కి ఈ చిత్రం భారీ విజయాన్ని అందిస్తుందా? అనేది వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement