
కోలీవుడ్ సమ్‌థింగ్ స్పెషల్ జంట విఘ్నేశ్, నయనతార. ఇవాళ విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది నయన్. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
బూర్జ్ ఖలీఫావద్ద కేక్ కటింగ్‌తో పాటు.. టపాసులుకూడా పేల్చుతూ.. విఘ్నేశ్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఈ లేడీ సూపర్ స్టార్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా మారింది. అటు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. ఇటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. స్టార్ హీరోయిన్ నయనతార ఈ ఏడాది ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఆమె కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ 'జవాన్' ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'లోనూ ఆమె నటిస్తున్నారు.
.
Comments
Please login to add a commentAdd a comment