
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ దుబాయ్‌లోని ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బుర్జ్ ఖలీఫా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేలా.. వైట్ టీషర్టు, బ్లూ జీన్స్‌తో దిగిన ఫొటోను గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు యువీ. ఆ ఫొటో తోటి క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, హర్భజన్ సింగ్‌లను ప్రత్యేకంగా ఆకర్షించింది. దీనిపై వారు స్పందించారు. ‘‘ ఎందుకు నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావు?’’ అని పీటర్సన్.. ‘‘ పాజీ అదిరింది!’’ అని హర్భజన్ అన్నారు. యువరాజ్ సింగ్ భార్య హజల్ కీచ్ కూడా ఆ ఫొటోపై ‘హాయ్! అందగాడా’ అని కామెంట్ చేశారు.
చదవండి : బ్రో.. డీఆర్‌ఎస్‌ను మరచిపోయావా?