న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుట్టినరోజు సందర్భంగా ట్విటర్ వేదికగా ‘హాయ్ మిర్చీ’ అంటూ శుభాకాంక్షలు చెప్పాడు. ‘హాయ్ మిర్చీ.. నా ప్రియనేస్తానికి పుట్టినరోజు.. శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చాడు. ఇక యువీ సరదా ట్వీట్‌కు సానియా కూడా అంతే సరదాగా రిప్లై ఇచ్చారు. ‘హాయ్ మోటూ. థాంక్యూ’ అంటూ బదులిచ్చారు. ఇక యువీ, సానియా ఫ్రెండ్స్ అవటం చేత సరదా కామెంట్లు చేసుకుంటారనేది తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం నున్నటి గడ్డంతో కనిపించిన యువీ.. ‘నున్నటి గడ్డంతో బాగున్నానా.. మళ్లీ పెంచనా’అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. ‘నున్నటి గడ్డం మాటున ఏం దాగుందో.. గడ్డం పెంచాల్సిందే’అంటూ సానియా రిప్లై ఇచ్చారు. ఇక యువీ ఇటీవలే అంతర్జాతీయా క్రికెట్‌కు, ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అనుమతితో అతను విదేశీ లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment