PM Modi Shares Video Of Surat Office Complex Bigger Than Pentagon - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే బిగ్గెస్ట్‌ ఆఫీస్‌ ఇండియాలో.. ప్రధాని మోదీ ప్రశంసలు

Published Wed, Jul 19 2023 1:40 PM | Last Updated on Wed, Jul 19 2023 3:45 PM

Do you know Now World Largest Office Surat Diamond Bourse bigger than Pentagon - Sakshi

ప్రపంచంలో ఎత్తైన భవనాలు,  లగ్జరీ  మాన్షన్స్‌ అనగానే మనకి దుబాయ్‌ గుర్తుకొస్తుంది. కదా ఇపుడు ప్రపంచం లోనే పెద్దది, అత్యాధునికమైన ఆఫీస్‌ నిర్మాణం ఆసక్తికరంగా మారింది.  పాపులర్‌ పెంటగాన్‌, బుర్జ్‌ ఖలీఫా భవనాలను మించి మన దేశంలో ఇది ఖ్యాతిని దక్కించుకోనుంది. అదీ డైమండ్‌ కేంద్రంగా.  డైమండ్స్‌ అనగానే  జెమ్‌ క్యాపిటల్‌, గుజరాత్‌లోని సూరత్‌ తొలత మదిలో మెదులుతుంది. ఇంతకీ ఆ రికార్డ్‌ బ్రేకింగ్‌ బిల్డింగ్‌ పై  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు. 

గుజరాత్‌లోని సూరత్‌లో రానున్న భవనం పెంటగాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ స్థలంగా మారనుందన్న వార్తలపై స్పందించిన ఆయన ఇది సూరత్ వజ్రాల పరిశ్రమ  చైతన్యాన్ని వృద్ధిని చూపుతుంది,  భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది భారతదేశ స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు , సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు.  (యాపిల్‌ ఐఫోన్‌14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు )

బెల్జియన్ నగరమైన ఆంట్‌వెర్ప్‌ను ప్రపంచంలోని వజ్రాల వ్యాపార కేంద్రంగా పిలుస్తారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది సూరత్. ఈ  నగరం ఇపుడు యుఎస్‌లోని ఆర్లింగ్‌టన్‌లోని పెంటగాన్, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ వంటి ప్రపంచంలోని అనేక ముఖ్యమైన కార్యాలయ సముదాయాలను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ‘సూరత్ డైమండ్ బోర్స్’ అధికారికంగా టాప్‌లో నిలిచింది.  ముంబైకి ఉత్తరాన 150 మైళ్ల దూరంలో సూరత్  ప్రపంచంలో టాప్‌లో నిలిచింది. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!)

సూరత్ డైమండ్ బోర్స్ ఈ బిల్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఈ సమాచారం ప్రకారం బహుళ-మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా నిలుస్తోంది. సూరత్ డైమండ్ బోర్స్‌ నిర్మించడానికి  నిర్మించడానికి మొత్తం నాలుగు సంవత్సరాలు పట్టిందట. అలాగే ఈ ఎంటైర్‌ ‍ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ. 3వేల 200 కోట్ల ఖర్చయిందిట. దీనిని గుజరాత్‌లో జన్మించి, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన భారత ప్రధాని మోదీ దీన్నిఈ ఏడాది చివర్లో   ప్రారంభించనున్నారు.

అత్యాధునిక సౌకర్యాలు, విశాలమై కారిడార్లు, ఇంటీరియర్‌, మార్బుల్ ఫ్లోరింగ్‌తో అద్భుతమైన ఈ భవనంలో  ఈ సంవత్సరం 65వేల  ఉద్యోగులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 35కు పైగా ఎకరాలలో విస్తరించి వున్న ఈ భవనంలో మొత్తం 15 అంతస్తులున్నాయి. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ ఏడాది  నవంబర్‌లో అఫీషియల్‌గా  కార్యకలాపాలను ప్రారంభించనుంది.

కట్టర్లు, పాలిషర్లు ,వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణుల కోసం "వన్-స్టాప్ డెస్టినేషన్"గా  ఉంటుంది. . డైమండ్ మైనింగ్ , క్యూరేషన్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఆతిథ్యం ఇస్తుంది. ఇది గుజరాత్ నగరం నుండి రైలులో ముంబైకి వచ్చిపోయే, కొన్నిసార్లు ప్రతిరోజూ వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంనది ప్రాజెక్ట్‌  సీఈవో మహేష్ గాధవి  మాటల్ని ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ రిపోర్ట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement