అహ్మదాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్‌పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్‌లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది.
15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్ 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్‌లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది.
ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం..
Comments
Please login to add a commentAdd a comment