surpassed
-
ఐటీ ఉద్యోగులను మించిపోయిన చెఫ్‌లు.. ఎలాగో చూడండి..
యూకే ఇమ్మిగ్రేషన్ డేటా ఇటీవలి విశ్లేషణ ఊహించని పరిణామాన్ని వెల్లడించింది. కంప్యూటర్ ప్రోగ్రామర్ల కంటే చెఫ్‌ల వీసా దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ సూపర్ పవర్ గా ఎదగాలన్న తన ఆకాంక్షలకు ఊతమిచ్చేందుకు అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2024 మార్చి వరకు 6,203 మంది చెఫ్‌లకు స్కిల్డ్ వర్కర్ వీసాలు మంజూరయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం అధికం. ఇదే సమయంలో ప్రోగ్రామర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లకు జారీ చేసిన వర్క్ పర్మిట్ల సంఖ్య 8,752 నుంచి 4,280కి పడిపోయింది. ఈ రెండు వృత్తులు ముఖ్యంగా భారతీయ వలసదారులలో ప్రాచుర్యం పొందాయి. యూకేలో భారతీయ రెస్టారెంట్ పరిశ్రమకి గణనీయమైన ఉనికి ఉంది.అయితే చెఫ్ వీసాల పెరుగుదల స్వల్పకాలికమే కావచ్చు. స్కిల్డ్ వర్కర్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల యువ వర్కర్లకు కనీస వేతనం 38,700 పౌండ్లకు (సుమారు రూ.41 లక్షలు) పెరిగింది. 2023 ఏప్రిల్ నాటికి యూకేలో సగటు చెఫ్ జీతం 22,877 పౌండ్లు (సుమారు రూ.24 లక్షలు)గా ఉంది. చాలా రెస్టారెంట్లు కొత్త వేతన స్థాయిలను భరించే అవకాశం లేదు. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే దరఖాస్తుల హడావుడి పెరిగినట్లుగా తెలుస్తోంది.మరింత కఠినమైన ఆంక్షలు, అధిక వీసా ఫీజులను ప్రవేశపెట్టిన యూకే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తాజా మార్పులను అధికారిక గణాంకాలు ఇంకా ప్రతిబింబించలేదు. 2023లో నికర వలసలు 10 శాతం తగ్గి 6,85,000 కు పడిపోవడం, వీసా దరఖాస్తులు తగ్గడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రారంభ సూచికలు సూచిస్తున్నాయి. -
ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్‌పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్‌లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్ 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం.. -
ముచ్చటగా మూడోసారి రూ.లక్ష కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు మరోసారి రూ. లక్ష కోట్ల వసూళ్లను దాటాయి. జనవరి మాసానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయల మార్కెను అధిగమించాయని ఆర్థికమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. గతనెల రూ. 94, 725 కోట్ల రూపాయలతో పోలిస్తే , గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ. 89, 825కోట్లతో పోలిస్తే జనవరిలో ఈ వసూళ్లను సాధించినట్టు ట్వీట్ చేసింది. కాగా గత ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి లక్షకోట్ల రూపాయలను దాటాయి. అనంతరం మళ్లీ అక్టోబర్ రెండవసారి ఈ మైలు రాయిని దాటాయి. రెండు నెలల విరామం తరువాత తిరిగి జనవరి మాసంలో ముచ్చటగా మూడోసారి జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల మార్క్‌ను దాటాయి. The total Gross GST Revenue collected in the month of January, 2019 has today crossed ₹ 1 lakh crore. This has been a significant improvement over collection of ₹ 94,725 crore during last month and ₹ 89,825 crore during the same month last year — Ministry of Finance (@FinMinIndia) January 31, 2019 -
రూ. 30,000 దాటిన బంగారం
రెండేళ్ల గరిష్టంలో ధరలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ మన దేశంలో పసిడి ధరలు పైకి ఎగిసాయి. దేశ రాజధానిలో పసిడి ధర (10 గ్రాములు) చూస్తుండగానే శుక్రవారం రూ.30,000 మార్క్‌ను అధిగమించింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, అమెరికా ఫెడ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, డాలర్ విలువ పది నెలల కనిష్టానికి చేరడం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు పెరిగాయి. దీనికి తోడు దేశంలో జువెలర్స్ నుంచి డిమాండ్ పెరగడం కూడా ఇక్కడి పసిడి ధరల పెరుగుదల ఒక కారణ మయ్యాయి. ప్రపంచ మార్కెట్లో కడపటి సమాచారంమేరకు పసిడి ధర ఔన్స్‌కు 1,295 డాలర్లకు పెరిగింది. వెండి ధర 1.7 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. వెండికి గతేడాది జనవరి నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9%, 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ధరలు రూ.350 పెరుగుదలతో వరుసగా రూ.30,250కు, రూ.30,100కు చేరాయి. 2014, మే 13 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. అలాగే పరిశ్రమలు సహా నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర (కిలో) కూడా రూ.600 పెరుగుదలతో రూ.41,600కు ఎగసింది.