సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ. లక్ష కోట్ల వసూళ్లను దాటాయి. జనవరి మాసానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయల మార్కెను అధిగమించాయని ఆర్థికమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. గతనెల రూ. 94, 725 కోట్ల రూపాయలతో పోలిస్తే , గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ. 89, 825కోట్లతో పోలిస్తే జనవరిలో ఈ వసూళ్లను సాధించినట్టు ట్వీట్ చేసింది.
కాగా గత ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి లక్షకోట్ల రూపాయలను దాటాయి. అనంతరం మళ్లీ అక్టోబర్ రెండవసారి ఈ మైలు రాయిని దాటాయి. రెండు నెలల విరామం తరువాత తిరిగి జనవరి మాసంలో ముచ్చటగా మూడోసారి జీఎస్‌టీ వసూళ్లు లక్షకోట్ల మార్క్‌ను దాటాయి.
The total Gross GST Revenue collected in the month of January, 2019 has today crossed ₹ 1 lakh crore. This has been a significant improvement over collection of ₹ 94,725 crore during last month and ₹ 89,825 crore during the same month last year
— Ministry of Finance (@FinMinIndia) January 31, 2019
Comments
Please login to add a commentAdd a comment