దుబాయి: ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ప్రసిద్ధిగాంచిన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా సమీపంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకున్నాయి. పదుల సంఖ్యలోని అంతస్తుల్లో అగ్ని కీలలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి.
దుబాయి ప్రభుత్వ అధీనంలోని ఎమార్ సంస్థ నిర్మించిన 8 బౌలెవార్డ్ వాక్ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. మంటలను అదుపు చేసిన తర్వాత పలు అంతస్తులు పూర్తిగా కాలిపోయి, నల్లగా మారిపోయినట్లు వీడియోలు, ఫోటోల్లో కనిపిస్తోంది.
In #Dubai, the #Emaar skyscraper caught fire near the #BurjKhalifa, the tallest building in the world.
— NEXTA (@nexta_tv) November 7, 2022
At the moment the fire was extinguished, there is no information about victims. pic.twitter.com/QtPmRBHSTq
ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కోటిశ్వరులుగా మారిన పోలీసులు..దెబ్బకు అకౌంట్ బ్లాక్!
Comments
Please login to add a commentAdd a comment