
'యోగా 100 శాతం సెక్యులర్ విధానం'
దుబాయ్: యోగా మతానికి సంబంధించింది కాదని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. యోగా శాస్త్రీయమైందని, విశ్వమంతటికీ చెందినదని పేర్కొన్నారు. ఇది వందశాతం సెక్యులర్ విధానం అని వ్యాఖ్యానించారు. దుబాయ్ లోని బూర్జ్ ఖలీపాలో ఆయన శనివారం సాయంత్రం యోగా శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన వివిధ దేశాలకు చెందిన 20 వేల మందితో యోగాసనాలు వేయించారు.
ఈ సందర్భంగా మట్లాడుతూ... దుబాయ తనకెంతో నచ్చిందని రాందేవ్ అన్నారు. '2009లో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చాలా మారిపోయింది. ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంద'ని రాందేవ్ పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా యోగా నేర్చుకున్నారని తెలిపారు.