Baba Ramdev Falls Off Elephant While doing Yoga at Mathura Camp | ట్రెండింగ్‌లో బాబా రామ్‌దేవ్ - Sakshi
Sakshi News home page

ఏనుగుపై యోగా : ట్రెండింగ్‌లో రాందేవ్ 

Published Wed, Oct 14 2020 2:33 PM | Last Updated on Wed, Oct 14 2020 3:28 PM

Baba Ramdev falls off elephant while performing yoga at Mathura camp  - Sakshi

సాక్షి, లక్నో: పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకుడు, యోగాసనాలకు పెట్టింది పేరైన బాబా రామ్‌దేవ్ ట్విటర్  ట్రెండింగ్‌లో ఉన్నారు. ఒక ఆశ్రమంలో ఏనుగు మీద యోగా నేర్పిస్తూ కిందపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయనపై సానుభూతితో పాటు కొంతమంది నెటిజనులు రకారకాల మీమ్స్ తో, యాక్ట్ ఆఫ్ గ్రావిటీ అంటూ వ్యంగ్యోక్తులతో సందడి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే బాబా రాందేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్ లో యోగా నేర్పించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ చక్కగా అలంకరించి ఉన్న ఏనుగును చూసి ఉత్సాహం పట్టలేని వెరైటీగా ఆసనాలు వేద్దామనుకున్నారు. ఆ భారీ ఏనుగుపై పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో వివరిస్తున్నారు.ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబాగారు బింకంగా అవేమీ పట్టించుకోకుండా యోగా భంగిమను కొనసాగించారు. మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే లేచి సర్దుకున్నరాందేవ్ అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చిత్ర విచిత్ర భంగిమలు, ఫోజులతో గతంలో వార్తల్లో నిలిచిన రాందేవ్ తాజాగా ఏనుగుమీద యోగాతో మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. అంతేకాదు గతంలో సైకిల్ తొక్కుతూ రాందేవ్ కింద పడ్డ వీడియో కూడా ఇపుడు విపరీతంగా షేర్ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement