సాధారణంగా వివాహ సమయంలో పెళ్లి మండపం వద్దకు వరుడు గుర్రం లేదా ఏనుగు మీద రావడం అందరికి తెలిసిందే. ఇలాంటివి తమ సంప్రదాయాలు, ఆచారాల మీద ఆధారపడి ఉంది. అచ్చం ఇలాగే ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో శుక్రవారం ఓ వివాహ కార్యక్రమం జరిగింది. కానీ పెళ్లి వేడుకలో అనుకోని ఓ విచిత్ర సంఘటన జరిగింది. జూన్ 11 రాత్రి వరుడు ఆనంద్ త్రిపాఠి నర్యాన్పూర్ గ్రామం నుంచి ఆమ్లాపూర్ వరకు ఏనుగుతో ఘనంగా వివాహా పార్టీకి చేరుకున్నాడు.
అయితే ఒక్కసారిగా పటాసుల శబ్దం ఎక్కువ రావడంతో ఏనుగు బెదిరిపోయింది. దీంతో పెళ్లి వేదికను నాశనం చేయడంతోపాటు అక్కడే ఉన్న వస్తువులన్నింటినీ చిందరవందర చేసేసింది. ఏనుగు దాడిలో పార్కింగ్‌లో ఉన్న నాలుగు కార్లు సైతం ధ్వంసమయ్యాయి. అంతేగాక ఏనుగు బీభత్సం దెబ్బకు వరడు పెళ్లి వేడుక నుంచి పారిపోయాడు. వెంటనే సహాయం కోసం అటవీశాఖ అధికారులకు, పోలీసులకు స్థానికలు సమాచారం ఇచ్చారు. అనంతరం అధికారులు వచ్చి ఆ ఏనుగును తమ నియంత్రణలోకి తీసుకోగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment