Emirates
-
ఆ విమానంలో ఇద్దరే ప్రయాణికులు! అదికూడా..
విమానంలో వెళ్తున్నప్పుడూ మనం మాత్రమే ఉండి మిగతా ప్రయాణికులు లేకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది కదు. అందులోనూ విమానంలో అలా జరిగితే మాములుగా అనిపించదు. అదికూడా కేవలం మన కోసమే ఏదో కారు బుక్ చేసుకున్నట్లు విమానంలో వెళ్తున్నామా! అనిపిస్తుంది. అదికూడా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే తెలిస్తే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది కదా! అలాంటి ఘటనే ఇక్కడ స్విట్జర్లాండ్‌కు వెళ్తున్న ఎమిరేట్స్ విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..సీషెల్స్ నుంచి స్విట్జర్లాండ్‌కి వెళ్తున్న ఎమిరేట్స్ మిమానంలో ఇద్దరే ప్రయాణికులు. 25 ఏళ్ల జో డోయల్, ఆమె తల్లి 59 ఏళ్ల కిమ్మీ చెడెల్ మాత్రమే ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వారిద్దరు ఎకనామీ క్లాస్ క్యాబిన్లో ఉన్నారు. ఫ్లైట్ జర్నీ చేసేంతవరకు తామిద్దరమే ప్రయాణికులని వారివురికి తెలియదు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లికూతుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే బిజినెస్ క్లాస్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు గానీ వాళ్లు ప్రయాణిస్తున్న ఎకనామీ క్లాస్‌లో మాత్రం లేరు. తాము మాత్రమే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నామని తెలిసి ఆనందంగా ఆ విమానంలో ఉన్న ఫ్లైట్ అటెండెంట్లతో చాట్ చేస్తూ గడిపామని టిక్‌టాక్‌లో వెల్లడించింది జో డోయల్. "ఈ రోజు ఎమిరేట్స్ విమానంలో ఎగురుతున్న ఏకైక మహిళలు మేమే" అని క్యాప్షన్ పెట్టి మరీ వీడియో పోస్ట్ చేసింది. బహుశా క్రిస్మస్‌టైం, పైగా సీషెల్స్‌లో వర్షాకాలం కావడంతో ప్రయాణికులు లేరని చెప్పుకొచ్చింది. ఇద్దరే విమానంలో ప్రయాణించడం చాలా ఆనందంగా ఉందని రాసింది. ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. వారు కూడా ఇలానే సంబరపడ్డారు. పైగా ఏదో ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న ఫీల్ కలిగిందని వారు చెప్పుకొచ్చారు కూడా. (చదవండి: మిసెస్ ఇండియాగా 55 ఏళ్ల మహిళ! గెలుపుకి ఏజ్‌తో పనిలేదని ప్రూవ్ చేసింది!) -
ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం
Airbus A380 Test Flight: ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం చోటు చేసుకుంది. విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ఎప్పటి నుంచో విమనాలు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సంస్థలకు విక్రయిస్తోంది. ఎయిర్‌బస్ రూపొందించిన విమానాల్లో ఏ 380 మోడల్ ఎంతో పాపులర్. ఈ మోడల్లో చివరి విమానం ఇటీవల జర్మనీలోని హంబర్గ్‌లో రూపొందింది. ఈ విమానాన్ని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి అప్పగించాల్సి ఉంది. అయితే అప్పగింతకి ముందు జర్మనీ గగన తలంపై ఈ విమానం చక్కర్లు కొట్టింది. టెస్ట్రైడ్లో భాగంగా హంబర్గ్‌లో బయల్దేరిన విమానం జర్మీ గగన తలంపై ప్రధాన నగరాల మీదుగా పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ప్రేమకు చిహ్నమైన హార్ట్ సింబల్ తరహాలో ఈ విమానం గగన తలంలో ప్రయాణించింది. ఈ ఫ్లైట్ ప్రయాణ మార్గానికి సంబంధించిన వీడియో, ఫోటోలను ఎయిర్‌బస్ సంస్థ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా హృదయం ఆకారరంలో ఉన్న విమాన ప్రయాణ మార్గం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. As we get ready to hand over MSN272 to @emirates, here's our Flight Test team sending some ❤️ to all #A380 fans out there. #MondayMotivation pic.twitter.com/2YXkEILdLZ — Airbus (@Airbus) December 13, 2021 -
గ్రాఫిక్స్ కాదంటూ యాడ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసిన ఫ్లై ఎమిరేట్స్
-
వివాదంలో యాడ్ షూటింగ్! అసలు నిజమేంటంటే..
Emirates Airlines Viral Ad Video: ఫ్లై బెటర్ అంటూ ఎమిరేట్స్ రూపొందించిన తాజా అడ్వర్టైజ్మెంట్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అత్యంత ప్రమాదకరంగా భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో చిత్రీకరించిన ఈ యాడ్ నిజం కాదంటూ అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఈ యాడ్‌కి సంబంధించి వివరాలను ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ వెల్లడించింది. అత్యంత ఎత్తులో దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఇటీవల కొత్త యాడ్‌ని రిలీజ్ చేసింది. ఈ యాడ్‌లో ఎయిర్ హోస్టెస్ నిల్చుని... ఎమిరేట్స్ విమానాల్లో దుబాయ్ రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని ఆహ్వానం పలుకుతుంది. చివరల్లో ఒక్కసారిగా కెమెరా జూమ్ అవుట్ అవగానే భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో కేవలం మీటరు స్థలం ఉన్న ఒక చిన్న పలకపై ఆ ఎయిర్ హోస్టెస్ నిల్చుని ఉన్న దృశ్యం కనిపిస్తుంది. ఆకాశంలో నిలబడి ఆకాశయానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా యాడ్ ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు నెలకొల్పిన బూర్జ్ ఖలీఫాపై ఈ యాడ్‌ను చిత్రీకరించారు. Reconnect with your loved ones or take a fabulous vacation. From 8th August travel to the UK gets easier.#FlyEmiratesFlyBetter pic.twitter.com/pEB2qH6Vyo — Emirates Airline (@emirates) August 5, 2021 ఇది నిజం కాదు ఎమిరేట్స్ ఈ అడ్వర్టైజ్మెంట్ని ఆగష్టు 5న విడుదల చేసింది. చూసినవారంతా యాడ్ బాగుందని మెచ్చుకన్నప్పటికీ ఇది నిజం కాదని, గ్రాఫిక్స్ అంటూ అనుమనాలు వ్యక్తం చేశారు. మరికొందరు అంత ఎత్తులో ఎయిర్ హోస్టెస్‌తో షూట్ చేయడం దారుణమని, ఏదైనా జరిగితే ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ యాడ్ షూట్‌కి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎమిరేట్స్ విడుదల చేసింది. షూటింగ్ ఇలా ఈ యాడ్ చిత్రీకరించేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది ఎమిరేట్స్. నెలల తరబడి రిహార్సల్ నిర్వహించింది. ముఖ్యంగా ఈ యాడ్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించిన స్మిత్ లుడ్విక్కి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకునే ఈ యాడ్ షూట్ చేశామంటూ ఎమిరేట్స్ వీడియో రిలీజ్ చేసింది. అడ్వర్టైజ్మెంట్తో పాటు ఇప్పుడీ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ షూటింగ్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో 160వ అంతస్థు నుంచి నిచ్చెనపై పైకి చేరుకునేందుకే గంటకు పైగా సమయం పట్టిందని స్మిత్ లుడ్విక్ తెలిపింది. Real or fake? A lot of you have asked this question and we’re here to answer it. Here’s how we made it to the top of the world’s tallest building, the @BurjKhalifa. https://t.co/AGLzMkjDON@EmaarDubai #FlyEmiratesFlyBetter pic.twitter.com/h5TefNQGQe — Emirates Airline (@emirates) August 9, 2021 -
ఐపీఎల్‌కు యూఏఈ క్లియరెన్స్.. కానీ
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తాజా సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన కసరత్తులు దాదాపు ముగింపు దశకు వచ్చేశాయి. ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణపై స్పష్టత ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్.. కార్యాచరణను వేగవంతం చేశారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నుంచి ఒక లేఖ అందినట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. తమకు బీసీసీఐ నుంచి మెయిల్ ద్వారా ఒక లేఖ వచ్చిందని ఈసీబీ పేర్కొంది. ‘బీసీసీఐ నుంచి అధికారిక లేఖ అందింది. కానీ భారత ప్రభుత్వం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నాం. తుది నిర్ణయం అనేది భారత ప్రభుత్వం ఇచ్చే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’ అని ఈసీబీ సెక్రటరీ ముబాషిర్ ఉస్మానీ తెలిపారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ జరిగేలా ఇప్పటికే ప్రాథమికంగా షెడ్యూల్‌ని తయారు చేసిన బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకి కూడా ఈ మేరకు సమాచారమిచ్చి నెల రోజుల ముందుగానే యూఏఈకి జట్లని తరలించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. (ఐసీసీ వన్డే సూపర్ లీగ్ వచ్చేసింది..) వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్‌కి తాము ఆతిథ్యమిస్తామని రెండు నెలల క్రితమే యూఏఈకి చెందిన ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రతిపాదనని బీసీసీఐకి పంపింది. కానీ.. సెప్టెంబరు నాటికి భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఆశించిన బీసీసీఐ అప్పట్లో మౌనంగా ఉండిపోయింది. అయితే.. దేశంలో ఇప్పటికీ పరిస్థితుల్లో అదుపులోకి రాకపోగా.. మరింతగా చేయి దాటిపోయాయి. దాంతో.. భారత్‌లో ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని తేల్చేసిన బీసీసీఐ... తాజాగా ఈసీబీ ప్రతిపాదనకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ లేఖని కూడా ఈసీబీకి పంపింది. కాగా, ఇప్పుడు భారత ప్రభుత్వం అనుమతి మాత్రమే ఐపీఎల్ నిర్వహణకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం బీసీసీఐ పెద్దలు భారత ప్రభుత్వాన్ని ఒప్పించే పనిలో ఉన్నారనేది కాదనలేని వాస్తవం. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. కానీ.. కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే భారత్ వెలుపల ఐపీఎల్ మ్యాచ్‌ల్ని బీసీసీఐ నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఆ తర్వాత 2014 ఎన్నికల సమయంలోనూ కొన్ని మ్యాచ్‌లకి యూఏఈ ఆతిథ్యమిచ్చింది. ఆ అనుభవంతోనే ఈసీబీకి మరో అవకాశం బీసీసీఐ ఇచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావాల్సిన టీ-20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఐపీఎల్‌కు మార్గం సుగుమం అయ్యింది. ఒకవేళ ఐపీఎల్ నిర్వహించకపోతే వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి రావడంతో ఈ లీగ్‌ను ఎలాగైనా జరపాలని బీసీసీఐ పట్టుదలగా ఉంది. దాంతోనే టీ20 వరల్డ్‌కప్ వాయిదా అనగానే ఐపీఎల్‌కు ఆగమేఘాలపై కసరత్తులు ముమ్మురం చేసింది.(కోహ్లిని మూడుసార్లు ఔట్ చేసేసరికి..) -
వైరలవుతున్న వజ్రాల విమానం..!?
రెండు రోజుల క్రితం ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి నెటిజన్లలో ఒకటే అనుమానం.. ‘ఇది నిజమేనా’.. ‘ఇంత ఖరీదైన విమానమా’.. ‘ఎంత ఖర్చు చేశారు’ అనే ప్రశ్నలు క్యూ కట్టాయి. ఇంతలా ఆకర్షించడానికి ఏముందా ఫోటోలో అని ఆలోచిస్తున్నారా.. ఎందుకంటే ఆ విమానం వేల వజ్రాల కాంతితో మిరిమిట్లుగొలుపుతోంది. దాంతో చూసిన వారికి ఇది వజ్రాలు పొదిగిన విమానమేమో అనే అనుమానం వచ్చింది. కానీ ఇది నిజంగా వజ్రాలు పొదిగిన విమానం కాదు. కేవలం ఫోటో మాత్రమే. ఈ విషయాన్ని ఎమిరేట్స్ సంస్థనే ప్రకటించింది. Presenting the Emirates ‘Bling’ 777. Image created by Sara Shakeel 💎💎💎 pic.twitter.com/zDYnUZtIOS — Emirates Airline (@emirates) December 4, 2018 విమానం ఫోటోను పోస్ట్ చేస్తూ ‘‘బ్లింగ్’ 777 ఇమేజ్ క్రియేటెడ్ బై సారా షకీల్’ అంటూ ఎమిరేట్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంటే ఇది కేవలం ఫోటో మాత్రమే అని ఎమిరేట్సే స్వయంగా ప్రకటించింది. అయితే నెటిజన్లు అంతా ఫోటోను మాత్రమే చూశారు. పక్కనే ఉన్న క్యాప్షన్‌ని చూడకపోవడంతో ఈ అనుమానాలు బయలు దేరాయి. చివరకు ఎమిరేట్స్ అధికారి ఒకరు ఇది సారా షకీల్ రూపొందించిన చిత్రం అంటూ వివరణ ఇచ్చారు. ‘ఆమె సృష్టించిన ఈ కళాఖండాన్ని మాత్రమే మేం పోస్టు చేశాం. ఇది నిజం కాదు’ అంటూ సదరు అధికారి మీడియాకు స్పష్టం చేశారు. ప్రముఖ క్రిస్టల్ ఆర్టిస్ట్ అయిన సారా షకీల్.. ఈ అద్భుత చిత్రాన్ని రూపొందించి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా ఎమిరేట్స్ సంస్థను ఆకర్షించింది. వెంటనే వారు ఆమె అనుమతితో ఈ ఫొటోను రీపోస్టు చేశారు. -
దుబాయ్ చరిత్రలోనే తొలిసారి..
దుబాయ్ : ఎడారి దేశంలో తొలిసారి.. దివ్వేల పండుగ జరుగుతుంది. అది కూడా ఏకంగా పది రోజులు. అవును.. దుబాయ్ ప్రభుత్వం తొలిసారి తమ దేశంలో దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తోంది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి దాదాపు పది రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. నవంబర్ 1న మొదలైన ఈ వేడుకలు ఈ నెల 10 వరకూ కొనసాగుతాయన్నారు. వేడుకల్లో భాగంగా పది రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల చేత ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు.. భంగ్రా ప్రదర్శనలతో పాటు దీపావళి సందర్భంగా దీపాల ప్రదర్శనే కాక ఫైర్‌క్రాకర్స్ షోని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీపావళి వేడుకల సందర్భంగా దుబాయ్ అధికారులు మరో అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది చేత ఒకేసారి ఎల్ఈడీ దీపాలను వెలిగించి.. గిన్నిస్ రికార్డ్ సృష్టించాలని దుబాయ్ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలిస్తోంది. ఇవన్ని ఒక ఎత్తయితే.. దీపావళి వేడుకలకే హైలెట్‌గా నిలిచిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏంటంటే దీపావళి వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మన జాతీయ పతాకాన్ని ప్రదర్శించడమే కాకుండా.. దుబాయి పోలీస్ బ్యాండ్ మన జాతీయ గీతాన్ని గిటార్ మీద ప్లే చేశారు. Diwali celebration in Dubai. Friend has shared this video from Ground Zero. A proud moment Indeed! Happy Diwali to all brother and Sisters of Dubai. pic.twitter.com/JflSGqqsoL — Prakash Priyadarshi (@priyadarshi108) November 5, 2018 అంతేకాక దుబాయ్ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ కూడా దివాళి వేడుకల్లో పాలుపంచుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భారతీయ సాంప్రదాయ మిఠాయిలను, చిరుతిళ్లను అందిస్తోంది. -
భోజనంలో బొద్దింక : రూ.84 లక్షలు కట్టండి..!
ముంబై : విమానంలో వెళ్లే సమయాల్లో కొన్ని సంస్థలు ప్రయాణికులకు భోజనం అందిస్తాయి. ఈ విషయం తెలిసే ఉంటుంది. కానీ ఆ భోజనంలో బొద్దింక వస్తే.. ఆ భోజనం తీసుకున్న వ్యక్తి లాయర్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కరెక్ట్ మీరు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగానే సీన్ జరిగింది. భోజనంలో బొద్దింక రావడంతో ఆ న్యాయవాది ఏకంగా రూ.87 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ముంబై మిర్రర్ ప్రచురించింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందని యూసఫ్ ఇక్బాల్ అనే న్యాయవాది గత నెల తన 40వ పుట్టిన రోజు జరుపుకోవడానికి భార్య సురిచి తోపాటు మరో 18 మంది స్నేహితలతో కలిసి ఎమిరేట్స్‌కు చెందిన విమానంలో మురాకోలోని కాసాబ్లాంకా నుంచి ముంబై ప్రయాణిస్తున్నారు. ఈసందర్భంగా సంస్థ బొద్దింక ఉన్న భోజనాన్ని ఇక్బాల్‌కు అందించింది. దీంతో ఆగ్రహించిన న్యాయవాది రూ.87లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ విమాన సంస్థకు నోటీసులు పంపించారు. ఈ సంఘటనతో తాను మానసికంగా బాధపడినందుకు నష్టపరిహారం రూ.50లక్షలు, తనకు తగిన సమయానికి ఆహారం అందివ్వనుందుకు రూ.30లక్షలు, తన భార్య ప్రయాణపు టికెట్లు రూ.7 లక్షలు, ఇలా మొత్తం రూ.87లక్షలను ఏప్రిల్ రెండో వారంలోపు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. ప్రయాణికులు ఆరోగ్యం పట్ల విమాన సంస్థ బాధ్యతారాహిత్యంగా పనిచేస్తోందంటూ మండిపడిన ఇక్బాల్ అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాలని అన్నారు. ఆయన 17 ఏళ్ల నుంచి లండన్‌కు చెందిన అంతర్జాతీయ న్యాయ మండలిలో పనిచేస్తున్నారు. -
విదేశీయులకు అమెరికా ఉపశమనం
న్యూఢిల్లీ: విమానమార్గంలో తమ దేశానికి వచ్చే విదేశీయులకు అమెరికా కాస్తంత ఉపశమనం కల్పించింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో అమెరికాకు వచ్చే విదేశీయులు తమ ల్యాప్‌టాప్స్‌ను వెంట తెచ్చేకునేందుకు అమెరికా అనుమతినిచ్చింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే తమ విమానాల్లో ల్యాప్‌టాప్‌లను అనుమతిస్తారని ఎమిరేట్స్ సంస్థ బుధవారం ప్రకటించింది. ఇస్తాంబుల్‌లోని ఆటాటర్క్ విమానాశ్రయం నుంచి అమెరికాకు వెళ్లే తమ విమానాల్లో ప్రయాణికులు తమ ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ స్పష్టంచేసింది. ఉగ్రవాద దాడుల భయంతో ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల్లో వచ్చే ప్రయాణికులపై మార్చి నెలలో అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కెమెరాలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమానం క్యాబిన్ బ్యాగుల్లో పెట్టి తీసుకురాకుండా ఆంక్షలు పెట్టింది. ఈ నిబంధనల ప్రభావం ఈజిప్ట్ ఎయిర్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్, ఖతార్ ఎయిర్వేస్, రాయల్ ఎయిర్ మొరాక్, రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్, సౌదీఅరేబియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై పడింది. తాజాగా నిబంధనలను సడలించిడంతో ఎమిరేట్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు ఉపశమనం కలిగింది. -
మరిన్ని నగరాలకు సర్వీసులు: ఎమిరేట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న దుబాయ్ సంస్థ ఎమిరేట్స్.. భారత్‌లో మరిన్ని నగరాలకు విమానాలను నడుపనుంది. ప్రస్తుతం 10 నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. సీట్ల సామర్థ్యం పెంపు విషయంలో భారత ప్రభుత్వంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదరగానే విస్తరణ ప్రారంభిస్తామని ఎమిరేట్స్ పశ్చిమ ఆసియా, భారత వాణిజ్య కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖూరీ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. కొత్త నగరాల్లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏ380 విమానాన్ని ముంబైకి మాత్రమే కంపెనీ నడుపుతోంది. ఒప్పందం పూర్తి అయితే ఢిల్లీ, హైదరాబాద్‌కు ఈ భారీ విహంగాన్ని నడిపేందుకు వీలుందని చెప్పారు. ఎమిరేట్స్ ప్రస్తుతం దుబాయ్-భారత్ మధ్య వారానికి 185 సర్వీసులను అందిస్తోంది. సీట్ల సామర్థ్యం 65 వేలు. 30 శాతం పెరిగిన కంపెనీలు... ఈ ఏడాది ఏవియేషన్ ప్రదర్శనకు అంతర్జాతీయంగా మంచి స్పందన వచ్చిందని మంత్రి చెప్పారు. ‘‘గత ఏవియేషన్ షోలతో పోలిస్తే పాల్గొనే కంపెనీల సంఖ్య 30% పెరిగింది. 25 దేశాల నుంచి 210కిపైగా కంపెనీలు, 29 విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి’’ అని తెలియజేశారు. రెండు దేశాలు, ఏడు రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్న ఈ సదస్సులో ప్రపంచంలోని అన్ని విమాన తయారీ కంపెనీల ప్రతి నిధులూ పాల్గొన్నారని చెప్పారాయన. ‘‘విమానాల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే పలు ఒప్పందాలు జరిగాయి. ఈ సారి ఎక్కువగా నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం. ఈ దిశగా కొత్త పాలసీలో పలు నిర్ణయాలు కూడా ప్రకటిస్తాం’’ అని వివరించారు. -
రికార్డు స్థాయిలో సీట్లను పెంచిన ఎమిరేట్స్
ఇప్పటికే ప్రపంచంలోనే అధికశాతం ప్రయాణీకులను తరలించే విమానంగా పేరొందిన ఎమిరేట్స్ మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటిదాకా ఏ విమానంలోనూ లేనన్నిఅత్యధిక సీట్లను కలిగిన విమానంగా 615 సీట్లను ఏర్పాటు చేసి... ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదటి తరగతిని పూర్తిగా తొలగించి, మొత్తం రెండే తరగతులతో, ప్రత్యేక సౌకర్యాలతో ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త A380 ఎమిరేట్స్ ఎయిర్ బస్... ఎకానమీ క్లాస్ లో ఒక్కో వరుసలో పది సీట్లు చొప్పున, 13 వరుసలతో మొత్తం 130 సీట్లను పెంచింది. ఎకానమీ క్లాస్ లో 557 సీట్లు, బిజినెస్ క్లాస్ లో 58 సీట్లు పెంచుతూ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక చర్యలతో ఇంతకు ముందు మూడు తరగతుల ప్రయాణీకులతో ఉండే విమానం కంటే ఇప్పుడు మరో 98 మంది ప్రయాణీకులను అధికంగా తరలించే అవకాశాన్ని కల్పించింది. సీట్లను పెంచడంలో భాగంగా ఎకానమీ క్లాస్ లోని ప్రయాణీకులు ఏ విధంగానూ నష్టపోవాల్సిన అవసరం లేదని.... ఫస్ట్ క్లాస్ భాగంలోని ఖాళీగా ఉన్న స్థలాన్ని వినియోగించి అదనంగా బిజినెస్ క్లాస్ లో 18 పడకల సీట్లను పెంచినట్లు సంస్థ వెల్లడించింది. బిజినెస్ క్లాస్ లో మాత్రం పూర్తి శాతం సౌకర్యాలతో ఫ్లాట్ సీట్లును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు మరింత ఆనందంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ కొత్త ఏర్పాట్లలో భాగంగా ప్రయాణీకులు.. కానాప్స్.. పానీయాలతో ఆన్ బోర్డ్ లాంజ్ ను కూడ ఎంజాయ్ చేయగలిగే అవకాశం ఉంది. దీనితో పాటు ఎమిరేట్స్ ఎకానమీ క్యాబిన్ కూడ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఓ చిన్న గ్రామంలో ఉండేటంత జనంతో ఈ దుబాయ్ కి చెందిన ఎయిర్ లైన్స్ విమానం తన ప్రత్యేకతను చాటుతోంది. -
అత్యవసరంగా విమానం దింపివేత
కొలంబో: సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ తగిన అనుమతులు తీసుకొని వెంటనే శ్రీలంకలోని కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశాడు. ఈ విమానంలో మొత్తం 500 మంది ప్రయాణీకులు ఉన్నారు. 'సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానం-ఏ 380- ఈకే 413ని సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా కొలంబోలో దించివేశాం' అని ఎయిర్ పోర్ట్ అధికార ప్రతినిధులు తెలియజేశారు. పైలెట్ సమయానికి స్పందించి సురక్షితంగా దించేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఎలాంటి సాంకేతిక లోపం అనే విషయంపై మాత్రం వివరణ ఇవ్వలేదు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని ముందస్తుగా అన్ని రక్షణ చర్యలకు ఏర్పాట్లు కూడా చేశారు. -
ఎయిర్‌లైన్స్ నుంచి హనీమూన్ ఆఫర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో హనీమూన్ కి వెళ్లాలనుకునే నూతన దంపతుల కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దుబాయ్ ఎమిరేట్స్ టికెట్ చార్జీలో 20% దాకా డిస్కౌంట్ ప్రకటించింది. మారిషస్, కేప్‌టౌన్, లండన్, ప్యారిస్, జ్యూరిక్, న్యూయార్క్ వంటి 20 నగరాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. మార్చి 31లోపు ప్రయాణాలకు ఈ నెల 7లోగా బుక్ చేసుకుంటే ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు, మలేషియాకి చెందిన ఎయిర్ఏషియా .. కౌలాలంపూర్‌కి వెళ్లే జంటలకు.. బాలి, ఫుకెట్ వంటి ప్రాంతాలకు ప్రమోషనల్ చార్జీలు ప్రకటించింది. వీటి ప్రకారం కౌలాలంపూర్‌కి కొచ్చి, కోల్‌కతా, తిరుచ్చిరాపల్లి నుంచి రూ. 5,000.. చెన్నై, బెంగళూరు నుంచి రూ. 6,500 టికెట్ చార్జీ (వన్ వే) ఉంటుంది. అక్కణ్నుంచి బాలి వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే రూ. 2,999కే వన్ వే టికెట్లు అందిస్తున్నట్లు ఎయిర్ఏషియా తెలిపింది. డిసెంబర్ 15 దాకా బుకింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 6 -ఏప్రిల్ 30దాకా చేసే ప్రయాణాలకే ఈ ఆఫర్.