ఎయిర్‌లైన్స్ నుంచి హనీమూన్ ఆఫర్లు | Eyeing wedding season in India, airlines offer special fares for honeymoon travel | Sakshi
Sakshi News home page

ఎయిర్‌లైన్స్ నుంచి హనీమూన్ ఆఫర్లు

Published Fri, Dec 6 2013 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Eyeing wedding season in India, airlines offer special fares for honeymoon travel

న్యూఢిల్లీ: విదేశాల్లో హనీమూన్ కి వెళ్లాలనుకునే నూతన దంపతుల కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. దుబాయ్ ఎమిరేట్స్ టికెట్ చార్జీలో 20% దాకా డిస్కౌంట్ ప్రకటించింది.  మారిషస్, కేప్‌టౌన్, లండన్, ప్యారిస్, జ్యూరిక్, న్యూయార్క్ వంటి 20 నగరాలకు  ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. మార్చి 31లోపు ప్రయాణాలకు  ఈ నెల 7లోగా బుక్ చేసుకుంటే ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు, మలేషియాకి చెందిన ఎయిర్‌ఏషియా .. కౌలాలంపూర్‌కి వెళ్లే జంటలకు.. బాలి, ఫుకెట్ వంటి ప్రాంతాలకు ప్రమోషనల్ చార్జీలు ప్రకటించింది. వీటి ప్రకారం కౌలాలంపూర్‌కి కొచ్చి, కోల్‌కతా, తిరుచ్చిరాపల్లి నుంచి రూ. 5,000.. చెన్నై, బెంగళూరు నుంచి రూ. 6,500 టికెట్ చార్జీ (వన్ వే) ఉంటుంది. అక్కణ్నుంచి బాలి వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే రూ. 2,999కే వన్ వే టికెట్లు అందిస్తున్నట్లు ఎయిర్‌ఏషియా తెలిపింది. డిసెంబర్ 15 దాకా బుకింగ్ ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 6 -ఏప్రిల్ 30దాకా చేసే ప్రయాణాలకే ఈ ఆఫర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement