ముంబై : విమానంలో వెళ్లే సమయాల్లో కొన్ని సంస్థలు ప్రయాణికులకు భోజనం అందిస్తాయి. ఈ విషయం తెలిసే ఉంటుంది. కానీ ఆ భోజనంలో బొద్దింక వస్తే.. ఆ భోజనం తీసుకున్న వ్యక్తి లాయర్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. కరెక్ట్ మీరు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువగానే సీన్ జరిగింది. భోజనంలో బొద్దింక రావడంతో ఆ న్యాయవాది ఏకంగా రూ.87 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ముంబై మిర్రర్ ప్రచురించింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందని యూసఫ్ ఇక్బాల్ అనే న్యాయవాది గత నెల తన 40వ పుట్టిన రోజు జరుపుకోవడానికి భార్య సురిచి తోపాటు మరో 18 మంది స్నేహితలతో కలిసి ఎమిరేట్స్‌కు చెందిన విమానంలో మురాకోలోని కాసాబ్లాంకా నుంచి ముంబై ప్రయాణిస్తున్నారు. ఈసందర్భంగా సంస్థ బొద్దింక ఉన్న భోజనాన్ని ఇక్బాల్‌కు అందించింది. దీంతో ఆగ్రహించిన న్యాయవాది రూ.87లక్షలు నష్టపరిహారం చెల్లించాలంటూ విమాన సంస్థకు నోటీసులు పంపించారు.
ఈ సంఘటనతో తాను మానసికంగా బాధపడినందుకు నష్టపరిహారం రూ.50లక్షలు, తనకు తగిన సమయానికి ఆహారం అందివ్వనుందుకు రూ.30లక్షలు, తన భార్య ప్రయాణపు టికెట్లు రూ.7 లక్షలు, ఇలా మొత్తం రూ.87లక్షలను ఏప్రిల్ రెండో వారంలోపు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. ప్రయాణికులు ఆరోగ్యం పట్ల విమాన సంస్థ బాధ్యతారాహిత్యంగా పనిచేస్తోందంటూ మండిపడిన ఇక్బాల్ అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవించాలని అన్నారు. ఆయన 17 ఏళ్ల నుంచి లండన్‌కు చెందిన అంతర్జాతీయ న్యాయ మండలిలో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment