Airbus A380 Test Flight: ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం చోటు చేసుకుంది. విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ ఎప్పటి నుంచో విమనాలు తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సంస్థలకు విక్రయిస్తోంది. ఎయిర్‌బస్ రూపొందించిన విమానాల్లో ఏ 380 మోడల్ ఎంతో పాపులర్. ఈ మోడల్‌లో చివరి విమానం ఇటీవల జర్మనీలోని హంబర్గ్‌లో రూపొందింది. ఈ విమానాన్ని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి అప్పగించాల్సి ఉంది. అయితే అప్పగింతకి ముందు జర్మనీ గగన తలంపై ఈ విమానం చక్కర్లు కొట్టింది.
టెస్ట్‌రైడ్‌లో భాగంగా హంబర్గ్‌లో బయల్దేరిన విమానం జర్మీ గగన తలంపై ప్రధాన నగరాల మీదుగా పలుమార్లు చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ప్రేమకు చిహ్నమైన హార్ట్ సింబల్ తరహాలో ఈ విమానం గగన తలంలో ప్రయాణించింది. ఈ ఫ్లైట్ ప్రయాణ మార్గానికి సంబంధించిన వీడియో, ఫోటోలను ఎయిర్‌బస్ సంస్థ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా హృదయం ఆకారరంలో ఉన్న విమాన ప్రయాణ మార్గం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
As we get ready to hand over MSN272 to @emirates, here's our Flight Test team sending some ❤️ to all #A380 fans out there. #MondayMotivation pic.twitter.com/2YXkEILdLZ
— Airbus (@Airbus) December 13, 2021
Comments
Please login to add a commentAdd a comment