వారానికి 4 రోజులే పని..ఫిబ్రవరి 1 నుంచే అమలు! | Germany Launching A Six Month Trial Of 4-Day Work Week | Sakshi
Sakshi News home page

వారానికి 4 రోజులే పని..ఫిబ్రవరి 1 నుంచే అమలు!

Published Mon, Jan 29 2024 9:21 PM | Last Updated on Tue, Jan 30 2024 9:20 AM

Germany Launching A Six Month Trial Of 4 Day Work - Sakshi

ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన కంపెనీలు ఉద్యోగులకు శుభవార్త చెబుతున్నాయి. వారానికి నాలుగు రోజులు మాత్రమే విధులు నిర్వహించేందుకు స్థానిక కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నాయి.  

ఓ వైపు ద్రవ్యోల్బణం మరోవైపు ఇమ్మిగ్రేషన్, తక్కువ జనన రేటుతో సమస్యలను జర్మనీ ఎదుర్కొంటోంది. ఫలితంగా జర్మన్ కంపెనీలు ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ఆ దేశంలో నిర్మాణ సంఘం 930,000 మంది కార్మికులకు 20శాతం కంటే ఎక్కువ జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు.  

 

ఇందులో భాగంగా జర్మనీలోని సంస్థలు ఫిబ్రవరి 1 నుండి నాలుగు రోజుల పని వారాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని 45 కంటే ఎక్కువ సంస్థలు ఆరు నెలల పాటు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయనున్నాయి. 

వారానికి నాలుగు రోజుల పని కారణంగా దేశం పని-జీవిత సమతుల్యతను ఆశించడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ చర్య ఆర్థిక అభివృద్ధి, శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని భావించిన జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్ లిండ్‌నర్ చెబుతున్నారు. మరి ఈ అంశం ఎటువైపుకి దారి తీస్తుందో తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement