ఉద్యోగుల కోసం టాప్ కంపెనీలు క్యూకట్టే ప్రతిష్టాత్మక టెక్ ఇన్‌స్టిట్యూట్ అది. కానీ ఫ్రెష్ గ్యాడ్యుయేట్ల ప్లేస్‌మెంట్ల కోసం పూర్వ విద్యార్థుల సాయం కోరాల్సివచ్చింది. ఐటీ, సర్వీస్ రంగాల్లో నియామకాల మందగమనం ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్ల కోసం దేశంలోని ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లు తమ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లను సంప్రదించాల్సి వస్తోంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నోకి ఈ దుస్థితి పట్టగా ఇప్పుడు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ (BITS) 2023 బ్యాచ్ విద్యార్థుల ప్లేస్‌మెంట్ కోసం పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ నుంచి మద్దతును కోరుతోంది. దేశంలోని మొదటి ఐదు బిజినెస్ స్కూల్స్‌లో ఒకటిగా నిలిచిన ఐఐఎం లక్నో ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల విద్యార్థుల కోసం ప్లేస్‌మెంట్‌లను పొందేందుకు తమ పూర్వ విద్యార్థులను సాయం కోరింది.
''దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ విధమైన తిరోగమనాన్ని చవిచూడలేదు. జనవరి 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించడంతో సాంకేతిక రంగం తీవ్రంగా ప్రభావితమైంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో అలుమ్ని రిలేషన్స్ డీన్ ఆర్య కుమార్ తెలిపారు.
బిట్స్ 2022-23 విద్యా సంవత్సరానికి 89.2 శాతం ఆరోగ్యకరమైన ప్లేస్‌మెంట్ శాతాన్ని సాధించగలిగిందని, అయితే నియామకాల మందగమనం అప్పటి నుండి మరింత దిగజారిపోయందని బిట్స్ ఆల్ముని డీన్ తన లేఖలో తెలిపారు. "ప్లేస్‌మెంట్ టీమ్‌లు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ, ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడంలో మన పూర్వ విద్యార్థుల మద్దతును కోరుతున్నారు" అని ఆర్య కుమార్ తన లేఖలో పేర్కొన్నారు, దీనిని మొదట ఎక్స్‌లో ఎడ్టెక్ వ్యవస్థాపకుడు రవి హండా షేర్ చేశారు. అయితే ఈ విషయంలో బిట్స్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
First IIM Lucknow, now BITS Pilani asking alumni to help out with placements.
— Ravi Handa (@ravihanda) February 22, 2024
This is the first time I am seeing such groveling after 2008.
"help them tide through current crisis"
"gentle request to please keep this in mind"
"Thanking you very much in advance" pic.twitter.com/TI27X7THk6
Comments
Please login to add a commentAdd a comment