alumni students
-
పుట్టినింటికి ఆడబిడ్డలు
ఊరు అంటే ఊరు కాదు. జ్ఞాపకాల తోట. ఖండాంతరాలు దాటినా ఆ పరిమళం మనసును వీడిపోదు. ఏదో ఒక సమయాన స్వరూపకు నాగమణి గుర్తుకు వస్తుంది. పక్కింటి నాగమణి, స్వరూప క్లోజ్‌ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి సినిమాకు వెళ్లడం నుంచి సీమచింతకాయల వేట వరకు వారి జ్ఞాపకాల్లో ఎన్నో ఉన్నాయి. పెళ్లి అయిన తరువాత నాగమణి అక్కడెక్కడో సూరత్‌లో ఉంటుంది. స్వరూప కూడా పెళ్లయిన తరువాత సొంతూరులో కాకుండా వేరే ఊళ్లో ఉంటుంది. ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.ఇక అంతేనా?‘ఈ 5జీ జమానాలో కూడా అంతేనా... ఇంతేనా అంటూ నిట్టూరిస్తే ఎలా?’ అంటూ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజన్న గూడెం మహిళలు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుల ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’ మనకు తెలుసు. అయితే ఇది అలాంటి సమ్మేళనం కాదు... రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం!పెళ్లయిన తరువాత ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్లలో ఉంటున్న ఆడపడుచులు ఈ సమ్మేళనం పుణ్యమా అని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. రోజంతా సంబరాలు చేసుకున్నారు! ‘నా బిడ్డలందరూ నా దగ్గరికి వచ్చారు’ అని ఊరు సంతోషంతో ఉప్పొంగి పోయిన రోజు అది....బతుకమ్మ పండుగ రోజు...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్న గూడెం ఆడబిడ్డలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉన్న ఊరిని వదిలి అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులందరు ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో ఒక చోటకు చేరారు. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే వారి సంఖ్య ప్రతి యేడూ తగ్గుతోంది. పోయిన బతుకమ్మ పండుగ రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు కొందరు మహిళలు. ‘అందరం ఒక రోజు కలుసుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది’ అనుకున్నారు. అది అసాధ్యమైన కోరికేమీ కాదనే విషయం కూడా వారికి తెలుసు. ‘ఎంత బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు అనుకోవడం కాదు. కచ్చితంగా కలవాల్సిందే’ అంటూ నడుం బిగించారు.సోషల్ మీడియా వేదికగా....అనుకున్నదే తడవుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్న తమ ఊరి ఆడబిడ్డలను ఒకదగ్గర చేర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పేరాల ఇందిర, సూదిని రజిని, యాట ఇందిరాదేవి, రావుల ఉమాదేవి, ఊట్కూరి లక్ష్మి నాలుగు నెలల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు సేకరించడం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వరకు ఎన్నో చేశారు.దాగుడుమూతలు... దస్తీబిస్తీలుఅనుకున్న రోజుకు దాదాపు అందరూ వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి తొంభై ఏళ్ల వయసు వరకు ఎంతోమంది మహిళలు వచ్చారు. వయసు తేడా లేకుండా చిన్నపిల్లలై పోయారు. దాగుడు మూతలు, దస్తీబిస్తీ, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, ఒంటికాలి కుంటుడు ఆటలు, డీజే పాటలతో హోరెత్తించారు.‘ఎవరి లోకం వారిదే’ అయిపోయిన ఈ కాలంలో, ఒకే ఇంటి కుటుంబ సభ్యులు కూడా వేరు వేరు ప్రపంచాలు అయిన ఈ ఉరుకులు పరుగుల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. పల్లె మోములో రోజూ పండగ కళను తీసుకువస్తాయి.మరెన్నో ఊళ్లకు ‘రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం’ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిద్దాం.ఇక ప్రతి సంవత్సరం...ఆ రోజు పండగే!మా ఊరి ఆడబిడ్డలం అందరం ఒకచోట చేరి చిన్న పిల్లలమయ్యాం. చిన్నప్పటి పండుగలను, ఆనాటి సంబరాలను గుర్తు చేసుకున్నాం. వయసు తేడా లేకుండా ఆటలాడుకున్నాం. మా ఊరి మీద మరింత ప్రేమ పెంచుకున్నాం. ప్రతి సంవత్సరం ‘ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువమంది హాజరయ్యేలా చూడాలనుకుంటున్నాం.– ఊట్కూరి లక్ష్మి, నల్లగొండకళ్లనీళ్లు పెట్టుకున్నారు‘రాజన్న గూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మా జీవితంలో మరవలేనిది. ఎన్నోతరాల ఆడబిడ్డలను ఒకచోటికి రప్పించాం. రకరకాల కారణాలతో పుట్టిన ఊరికి ఇక రాలేమనుకున్న వారిని సైతం గుర్తించి రప్పించడం విశేషంగా భావిస్తున్నాం. ఆడబిడ్డలందరినీ ఒకచోట చూసి పెద్ద వయసు వారు కన్నీటి పర్యంతమయ్యారు.– పేరాల ఇందిర, మోత్కూరుమళ్లీ మళ్లీ రావాలని...తల్లిదండ్రులు చనిపోయిన వారు, సింగిల్ పేరేంట్స్... మొదలైనవారు మా ఊరికి చాలా ఏళ్లుగా రావడం లేదు. అలాంటి వారందరినీ ‘ఆత్మీయ సమ్మేళనం’ ద్వారా రప్పించాం. వచ్చినవారంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నారు. నిక్‌నేమ్‌లను గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇలాంటి కార్యక్రమం పెడితే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లు వస్తామని సంతోషంగా చెప్పి వెళ్లారు. – సూదిని రజిని, సిరిపురంఅంబరాన్ని అంటిన సంబరంప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొద్దిమందిమి మాత్రమే పుట్టింటికి వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆత్మీయ సమ్మేళనం’కు రూపకల్పన చేశాం. ఊరు దాటగానే ఎవరి లోకం వారిదై పోతుంది. అలా కాకుండా పట్టుదలగా, ఇష్టంగా పనిచేశాం. రాలేమన్న వారిని ఒప్పించి రప్పించాం. మా ఊరి ఆడబిడ్డల ముఖాల్లో మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూశాం. – యాట ఇందిరాదేవి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్,సీతాఫల్ మండి, సికింద్రాబాద్ – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
టాప్ టెక్ ఇన్స్టిట్యూట్కి ఎంతటి దుస్థితి! ప్లేస్మెంట్ల కోసం దీనంగా..
ఉద్యోగుల కోసం టాప్ కంపెనీలు క్యూకట్టే ప్రతిష్టాత్మక టెక్ ఇన్స్టిట్యూట్ అది. కానీ ఫ్రెష్ గ్యాడ్యుయేట్ల ప్లేస్మెంట్ల కోసం పూర్వ విద్యార్థుల సాయం కోరాల్సివచ్చింది. ఐటీ, సర్వీస్ రంగాల్లో నియామకాల మందగమనం ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్ల కోసం దేశంలోని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు తమ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లను సంప్రదించాల్సి వస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నోకి ఈ దుస్థితి పట్టగా ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, పిలానీ (BITS) 2023 బ్యాచ్ విద్యార్థుల ప్లేస్మెంట్ కోసం పూర్వ విద్యార్థుల నెట్వర్క్ నుంచి మద్దతును కోరుతోంది. దేశంలోని మొదటి ఐదు బిజినెస్ స్కూల్స్‌లో ఒకటిగా నిలిచిన ఐఐఎం లక్నో ఇటీవలి బ్యాచ్ గ్రాడ్యుయేట్ల విద్యార్థుల కోసం ప్లేస్మెంట్లను పొందేందుకు తమ పూర్వ విద్యార్థులను సాయం కోరింది. ''దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ విధమైన తిరోగమనాన్ని చవిచూడలేదు. జనవరి 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించడంతో సాంకేతిక రంగం తీవ్రంగా ప్రభావితమైంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేఖలో అలుమ్ని రిలేషన్స్ డీన్ ఆర్య కుమార్ తెలిపారు. బిట్స్ 2022-23 విద్యా సంవత్సరానికి 89.2 శాతం ఆరోగ్యకరమైన ప్లేస్మెంట్ శాతాన్ని సాధించగలిగిందని, అయితే నియామకాల మందగమనం అప్పటి నుండి మరింత దిగజారిపోయందని బిట్స్ ఆల్ముని డీన్ తన లేఖలో తెలిపారు. "ప్లేస్మెంట్ టీమ్‌లు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ, ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడంలో మన పూర్వ విద్యార్థుల మద్దతును కోరుతున్నారు" అని ఆర్య కుమార్ తన లేఖలో పేర్కొన్నారు, దీనిని మొదట ఎక్స్‌లో ఎడ్టెక్ వ్యవస్థాపకుడు రవి హండా షేర్ చేశారు. అయితే ఈ విషయంలో బిట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. First IIM Lucknow, now BITS Pilani asking alumni to help out with placements. This is the first time I am seeing such groveling after 2008. "help them tide through current crisis" "gentle request to please keep this in mind" "Thanking you very much in advance" pic.twitter.com/TI27X7THk6 — Ravi Handa (@ravihanda) February 22, 2024 -
రేయ్ అని పిలిచే హక్కు వారికే ఉంటుంది
లక్డీకాపూల్ (హైదరాబాద్): చరిత్ర నిర్మాతలు ప్రజలేనని మాజీ ఎమ్మెల్యే, సైఫాబాద్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి ఈటల రాజేందర్ చెప్పారు. శనివారం సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో జరిగిన మెగా అల్యూమ్ని వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఎన్ఆర్ఐలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ కాలేజీలో 1981 నుంచి 84 వరకు చదువుకున్నానని, కాలేజీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారంటూ ఈటల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అరే అని పిలవగలిగే హక్కు స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఉంటుందన్నారు. సైఫాబాద్ కాలేజీ ఇచ్చిన చైతన్యంతో పెరిగిన తనపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదన్నారు. తాను బయాలజీ విద్యార్థినే కానీ ఆర్థికవేత్తను కాదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిగా తన ప్రసంగంలో మొదటిపేరాలో.. ‘ఈ డబ్బు, బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజలు తమ రక్త మాంసాలతో కష్టపడ్డ చెమటతో కట్టిన డబ్బులు.. ఈ డబ్బుకు పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత ఉంద’ని చెప్పానన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కె. సురేందర్, రాజస్తాన్ హైకోర్టు, న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, ఓయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్, పూర్వ విద్యార్థులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఈ.వెంకట్ నర్సింహా రెడ్డి, రాచకొండ డీసీపీ ఇందిర ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న సీఎం జగన్
-
‘చదువుల దేవాలయం ఆంధ్రా యూనివర్సిటీ’
సాక్షి, విశాఖపట్నం : చదువులే మనల్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీ చదువుల దేవాలయం అని కొనియాడారు. ప్రపంచానికే మేధావులను అందించిన గొప్ప చరిత్ర ఏయూది అని ప్రశంసించారు. అలాంటి యూనివర్సీటీలో 549 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ప్రభుత్వంగా తల దించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే విద్యావ్యవస్థలో పలు మార్పులు చేపట్టామని సీఎం జగన్ అన్నారు. ప్రతి పాఠశాలలోనూ 9 రకాల కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం మూడు దశల్లో నిర్వహిస్తున్నామన్నారు. మెదటి దశలో 15వేల స్కూళ్లలో మరుగుదొడ్లు, త్రాగు నీరు, బ్లాక్ బోర్డు లాంటి మౌలిక వసతులు కల్పించబోతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ఇంగ్లీష్ ల్యాబ్‌లు, బ్రిడ్జ్‌కోర్సులు ఏర్పాటు చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగాలు వచ్చేలా డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో మార్పులు చేస్తామన్నారు. డిగ్రీ స్థానంలో డిగ్రీ ఆనర్స్‌గా మార్చి, ఒక ఏడాది ప్రాక్టికల్ శిక్షణ అందిస్తామన్నారు. బీకామ్ లాంటి కోర్సులకు మూడేళ్లు చదువులు, ఒక ఏడాది ప్రాక్టికల్ శిక్షణ ఉండేలా మార్పులు చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యాదీవెన పథకం కింద రూ.20వేలు అందిస్తున్నామని గుర్తుచేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే పూర్వ విద్యార్థుల సంఘాల పాత్ర కీలకం అన్నారు. విద్యార్థులకు సహాయపడేలా యూనివర్సీటీలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఏయూ పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నుంచి రూ.50కోట్లను యూనివర్సీటీకి అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం రీడింగ్ రూమ్, జీఎం ఆర్ బ్లాక్ హాస్టల్ భవనాలకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర సంస్థ సీఈవో సీపీ గుర్నానీ, గ్రంథి మల్లిఖార్జునరావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, శిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీఎంఆర్ అధినేత, అలుమ్ని వ్యవస్థాపక చైర్మన్ జీఎం రావు, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, మాజీ డీజీపీ, గంగవరం పోర్ట్ సీఈవో సాంబశివరావు, మాజీ వీసీ ప్రొఫెసర్ బీల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘చదువుల దేవాలయం ఆంధ్ర యూనివర్సిటీ’
-
బిట్స్ పిలానీకి 7.17 కోట్ల విరాళం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఉన్న ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీకి పూర్వ విద్యార్థులు భారీ సాయం అందించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పారిశ్రామికవేత్త ప్రశాంత్ పాలకుర్తి, ఆయన భార్య అనురాధ బిట్స్ పిలానీకి రూ.7.17 కోట్ల(మిలియన్ డాలర్ల) భారీ విరాళాన్ని ప్రకటించారు. రాజస్తాన్ క్యాంపస్‌లో శుక్రవారం ప్రారంభమైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం( 1978–83 బ్యాచ్) సందర్భంగా ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ప్రస్తుతం అమెరికా కేంద్రంగా రెఫ్లెక్సిస్ అనే కంపెనీని నడుపుతుండగా, అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే ఎంటర్టైన్మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై బిట్స్ పిలానీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.సౌవిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘పాలకుర్తి ప్రశాంత్, అనురాధ దంపతులు అందజేసిన భారీ విరాళాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ నేపథ్యంలో మేం ఇప్పుడు సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. బిట్స్ పిలానీని ప్రపంచస్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో భాగంగా రూ.100 కోట్లతో పరిశోధన నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేయబోతున్నాం. అంతర్జాతీయంగా పరిశోధన అంశాలపై దృష్టి సారించే ఫ్యాకల్టీతో పాటు పోస్ట్ డాక్టోరల్ ఫెలోస్, రీసెర్చ్ స్కాలర్లను ఆకర్షించేలా బిట్స్ పిలానీని తీర్చిదిద్దుతాం. ఈ గొప్ప ప్రయత్నానికి తమవంతు సహకారం అందించాలని సంస్థ పూర్వ విద్యార్థులను కోరుతున్నాం’ అని తెలిపారు. 200 మంది పూర్వ విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రశాంత్ పాలకుర్తి మాట్లాడుతూ..‘ 40 సంవత్సరాల క్రితం మా ప్రయాణం ఇక్కడే (బిట్స్ పిలానీ) మొదలైంది. జీవితంలో ఎదిగేందుకు మాకు ఎంతో సాయం చేసిన ఈ సంస్థకు ఎంతోకొంత తిరిగివ్వాలని భావించాం’ అని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ‘డెజర్ట్ స్ట్రోమ్’ పేరుతో అనురాధ సంగీత విభావరి నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య... హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ప్రశాంత్ పాలకుర్తి తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. అనంతరం బిట్స్ పిలానీ నుంచి గణితం, మేనేజ్మెంట్లో డిగ్రీ పట్టాలు అందుకున్నారు. తన జూనియర్ అయిన అనురాధను పెళ్లి చేసుకున్నారు. ఆతర్వాత అమెరికాకు వెళ్లి 2001లో రిఫ్లెక్సిస్ సిస్టమ్స్ అనే సంస్థను స్థాపించారు. స్టోర్ల నిర్వహణ, వినియోగదారుల్ని ఆకర్షించడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వంటి రిటైల్ మేనేజ్మెంట్ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. నేపథ్య గాయని అయిన అనురాధ జూజూ ప్రొడక్షన్స్ అనే కంపెనీని ఏర్పాటుచేసి సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు. మసాచుసెట్స్ రాష్ట్రం వెస్టన్‌లో ఉంటున్న వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
నిధుల కోసం కేంద్రాన్ని అడుక్కోకండి
పుణే: విద్యాసంస్థలు నిధుల కోసం ప్రభుత్వాన్ని అడుక్కునే బదులు తమ పూర్వ విద్యార్థులను ఆశ్రయించాలని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవడేకర్ సూచించారు. శుక్రవారం ఇక్కడి జ్ఞాన ప్రబోధిని పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘ప్రపంచ వ్యాప్తంగా పాఠశాలల నుంచి వర్సిటీల వరకు ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వాలు కాదు.. అక్కడ చదువుకుని ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన పూర్వ విద్యార్థులే’అని ఆయన పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు సాయం కోసం విరామం లేకుండా ప్రభుత్వాన్ని అడుక్కుంటాయని, కానీ నిజమైన సాయం వారి వద్దే ఉందని చెప్పారు. తాము చదుకున్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి విరాళాలు ఇవ్వడం ఓ బాధ్యతగా తీసుకోవాలని ఆయన కోరారు. -
పూర్వ విద్యార్థుల కృతజ్ఞతలు
గత అక్టోబర్ 12న హుద్‌హుద్ పేరున్న మహమ్మారి తుపాను విశాఖపట్నం తీరాన్ని అత్యంత బీభత్సంగా తాకి, కనీవినీ ఎరు గని ప్రాణ నష్టం, ఆస్తినష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఆ తుపాను ప్రభావం వలన మన ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆ తుపాను విలయాన్ని చూసీ చూడగానే అక్కడే చదువుకుని అమెరికాలో ఉంటున్న మా పూర్వ విద్యార్థుల స్వచ్ఛంద బృందం స్పందించింది. వైస్ చాన్సలర్ జి.ఎస్.ఎన్. రాజు గారితో వ్యక్తిగతంగా మాట్లాడి జరిగిన నష్ట తీవ్రత గురించి స్పష్టమైన అవగాహనకు వచ్చింది. ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రాంగణం పునరుద్ధరణకి తక్షణ సహాయంగా గత డిసెంబర్ నెలలో కొంత విరాళమూ, ఆఖరి విడతగా ఈ వారంలో మరొక 13 వేల పైచిలుకు వెరసి సుమారు 20 వేల డాలర్ల వరకు ఆర్థిక సహాయం అందించగ లిగాం. మా విన్నపాన్ని మన్నించి స్వచ్ఛందంగా విరాళాలు అందచేసిన వారందరికీ, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉప కులపతి గారికి, ఇతర సిబ్బందికీ మా పూర్వ విద్యార్థుల బృందం తర పున మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వంగూరి చిట్టెంరాజు - అమెరికాలోని ఆంధ్ర యూనివర్సిటీ, పూర్వ విద్యార్థుల స్వచ్ఛంద బృందం