గత అక్టోబర్ 12న హుద్‌హుద్ పేరున్న మహమ్మారి తుపాను విశాఖపట్నం తీరాన్ని అత్యంత బీభత్సంగా తాకి, కనీవినీ ఎరు గని ప్రాణ నష్టం, ఆస్తినష్టం కలిగించిన విషయం తెలిసిందే. ఆ తుపాను ప్రభావం వలన మన ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆ తుపాను విలయాన్ని చూసీ చూడగానే అక్కడే చదువుకుని అమెరికాలో ఉంటున్న మా పూర్వ విద్యార్థుల స్వచ్ఛంద బృందం స్పందించింది. వైస్ చాన్సలర్ జి.ఎస్.ఎన్. రాజు గారితో వ్యక్తిగతంగా మాట్లాడి జరిగిన నష్ట తీవ్రత గురించి స్పష్టమైన అవగాహనకు వచ్చింది.
ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రాంగణం పునరుద్ధరణకి తక్షణ సహాయంగా గత డిసెంబర్ నెలలో కొంత విరాళమూ, ఆఖరి విడతగా ఈ వారంలో మరొక 13 వేల పైచిలుకు వెరసి సుమారు 20 వేల డాలర్ల వరకు ఆర్థిక సహాయం అందించగ లిగాం. మా విన్నపాన్ని మన్నించి స్వచ్ఛందంగా విరాళాలు అందచేసిన వారందరికీ, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉప కులపతి గారికి, ఇతర సిబ్బందికీ మా పూర్వ విద్యార్థుల బృందం తర పున మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
వంగూరి చిట్టెంరాజు
- అమెరికాలోని ఆంధ్ర యూనివర్సిటీ, పూర్వ విద్యార్థుల స్వచ్ఛంద బృందం
పూర్వ విద్యార్థుల కృతజ్ఞతలు
Published Wed, May 13 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement