టేక్మాల్(మెదక్): పది రూపాయాల కాయిన్ దీనికోసం బ్యాంకుల చుట్టూ జనం తిరుగుతారు. కష్టం మీద ఎదోలా సంపాదించి భద్రంగా ఇంట్లో దాచుకుంటున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పదిరూపాయల బిల్ల పట్టుకోవడానికి భయపడుతున్నారు. వ్యాపారులైతే తీసుకోవడానికి వణుకుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెల్లవని పుకార్లు రావడమే.
గత కొన్ని నెలల రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది. పది రూపాయల కాయిన్ చెల్లుతుందని ఎలాంటి భయం అనుమానం అవసరం లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పది రూపాయల కాయిన్‌లు వచ్చిన కొత్తలో ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదిరూపాయాల కాయిన్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. ఇన్నాళ్లు దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నా రు.
అయితే చాలా మంది వ్యాపారులు తీసుకోవడానికి ఇష్టత చూపడంలేదు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న వాటిని ప్రజలకు అంటకట్టడానికి చూస్తున్నారు. దీంతో చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లె వారికి కండక్టర్ చిల్లర రూ.10 కాయిన్ ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. చివరికి బ్యాంకుల్లో కూడా తీసుకోవడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అపోహలు వదలండి..
ఆర్‌బీఐ నిబందనల ప్రకారం రూ.10 కాయిన్ చెల్లుబాటు అవుతుంది. పదిరూపాయాల బిల్ల రద్దు కాలేదు. రూ.10కాయిన్ చెల్లుబాటుపై ప్రజలు వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వ్యాపారులు, ప్రజలు ఇచ్చుపుచ్చుకోవడం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment