Invalid Currency
-
అమ్మో ...రూ.10 నాణెమా..!
టేక్మాల్(మెదక్): పది రూపాయాల కాయిన్ దీనికోసం బ్యాంకుల చుట్టూ జనం తిరుగుతారు. కష్టం మీద ఎదోలా సంపాదించి భద్రంగా ఇంట్లో దాచుకుంటున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పదిరూపాయల బిల్ల పట్టుకోవడానికి భయపడుతున్నారు. వ్యాపారులైతే తీసుకోవడానికి వణుకుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెల్లవని పుకార్లు రావడమే. గత కొన్ని నెలల రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది. పది రూపాయల కాయిన్ చెల్లుతుందని ఎలాంటి భయం అనుమానం అవసరం లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పది రూపాయల కాయిన్లు వచ్చిన కొత్తలో ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదిరూపాయాల కాయిన్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. ఇన్నాళ్లు దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నా రు. అయితే చాలా మంది వ్యాపారులు తీసుకోవడానికి ఇష్టత చూపడంలేదు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న వాటిని ప్రజలకు అంటకట్టడానికి చూస్తున్నారు. దీంతో చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లె వారికి కండక్టర్ చిల్లర రూ.10 కాయిన్ ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. చివరికి బ్యాంకుల్లో కూడా తీసుకోవడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోహలు వదలండి.. ఆర్బీఐ నిబందనల ప్రకారం రూ.10 కాయిన్ చెల్లుబాటు అవుతుంది. పదిరూపాయాల బిల్ల రద్దు కాలేదు. రూ.10కాయిన్ చెల్లుబాటుపై ప్రజలు వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వ్యాపారులు, ప్రజలు ఇచ్చుపుచ్చుకోవడం చేయాలి. -
ఎయిర్‌పోర్టులో చెల్లని నోట్లు
టీనగర్: ఎయిర్‌పోర్టులో రెండు లక్షల రూపాయల చెల్లని నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది పోలీసు జాగిలం, మెటల్ డిటెక్టర్ పరికరం ద్వారా కారు పార్కింగ్, పా ర్కుల వద్ద శుక్రవారం రాత్రి తనిఖీలు జరిపారు. ప్రయాణికుల లగేజీలను తీసుకువెళ్లే ఒక ట్రాలీలో ఎవరికీ చెందని ఒక బ్యాగ్ కనిపించింది. అందులో తనిఖీ చేయగా ఒక పక్క చిరిగిన బ్యాగులో చెల్లని రూ.500, వెయి రూపాయల నోట్లు కనిపించాయి. ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు దాన్ని ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు అప్పగించారు. బ్యాగ్‌ను విప్పి చూడగా చెల్లని నోట్లు రూ. 2.1 లక్షలు, మలేషియాలో విక్రయించే చాక్లెట్లు కనిపిం చాయి. బ్యాగ్‌లోని చిరునామాను బట్టి చూడగా మలేషియాకు చెందిన సయ్యద్ మహ్మద్ (38)కి చెందినదిగా వెల్లడైంది. శనివారం విమానాశ్రయానికి వచ్చిన సయ్యద్ మహ్మద్ విమానాశ్రయ మేనేజర్‌తో తన లగేజీ వ దిలి వెళ్లడం గురించి వివరించి నగదు కు సంబంధించిన పత్రాలు చూ పాడు. తిరుచ్చిలో ఉన్న బంధువు ఇం టికి వచ్చి విహారయాత్రకు వెళ్లనున్న ట్లు, ఇందుకోసం మలేషియా నుంచి భారత కరెన్సీగా మార్చుకుని తీసుకొచ్చినట్లు తెలిపాడు. దీనిపై ఎయిర్‌పోర్టు మేనేజర్ విచారణ జరిపిన అనంతరం నగదు, చాక్లెట్లను సయ్యద్ మహ్మద్‌కు అప్పగించారు.