టీనగర్: ఎయిర్‌పోర్టులో రెండు లక్షల రూపాయల చెల్లని నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది పోలీసు జాగిలం, మెటల్ డిటెక్టర్ పరికరం ద్వారా కారు పార్కింగ్, పా ర్కుల వద్ద శుక్రవారం రాత్రి తనిఖీలు జరిపారు. ప్రయాణికుల లగేజీలను తీసుకువెళ్లే ఒక ట్రాలీలో ఎవరికీ చెందని ఒక బ్యాగ్ కనిపించింది. అందులో తనిఖీ చేయగా ఒక పక్క చిరిగిన బ్యాగులో చెల్లని రూ.500, వెయి రూపాయల నోట్లు కనిపించాయి. ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ జవాన్లు దాన్ని ఎయిర్‌పోర్టు మేనేజర్‌కు అప్పగించారు. బ్యాగ్‌ను విప్పి చూడగా చెల్లని నోట్లు రూ. 2.1 లక్షలు, మలేషియాలో విక్రయించే చాక్లెట్లు కనిపిం చాయి.
బ్యాగ్‌లోని చిరునామాను బట్టి చూడగా మలేషియాకు చెందిన సయ్యద్ మహ్మద్ (38)కి చెందినదిగా వెల్లడైంది. శనివారం విమానాశ్రయానికి వచ్చిన సయ్యద్ మహ్మద్ విమానాశ్రయ మేనేజర్‌తో తన లగేజీ వ దిలి వెళ్లడం గురించి వివరించి నగదు కు సంబంధించిన పత్రాలు చూ పాడు. తిరుచ్చిలో ఉన్న బంధువు ఇం టికి వచ్చి విహారయాత్రకు వెళ్లనున్న ట్లు, ఇందుకోసం మలేషియా నుంచి భారత కరెన్సీగా మార్చుకుని తీసుకొచ్చినట్లు తెలిపాడు. దీనిపై ఎయిర్‌పోర్టు మేనేజర్ విచారణ జరిపిన అనంతరం నగదు, చాక్లెట్లను సయ్యద్ మహ్మద్‌కు అప్పగించారు.
ఎయిర్‌పోర్టులో చెల్లని నోట్లు
Published Mon, Dec 12 2016 2:30 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
Advertisement