
ముంబై:తయారీ, సేవల రంగాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం రెండు కీలక సర్వేలను ఆవిష్కరించింది. క్లుప్తంగా వీటిని పరిశీలిస్తే...తయారీ రంగం పనితీరును మదింపు చేయడానికి త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పారిశ్రామిక అవుట్‌లుక్ సర్వే (ఐఓఎస్) ప్రారంభమైంది.
►సేవలు, మౌలిక రంగాలకు సంబంధించి ప్రస్తుత త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పనితీరును తెలుసుకునేందుకు సేవలు, మౌలికరంగ అవుట్‌లుక్ సర్వే (ఎస్‌ఐఓఎస్)ను ఆర్‌బీఐ ప్రారంభమైంది.
► సేవలు, తయారీ, మౌలిక రంగాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఏ విధంగా పనితీరును కనబరుస్తున్నాయి?, వ్యాపార సెంటిమెంట్ ఎలా ఉంది?, డిమాండ్, ఫైనాన్షియల్, ఉపాధి అవకాశాలు, ధరల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై ఈ సర్వే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తద్వారా మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) పరిస్థితిపై ఒక అంచనాలకు వస్తుంది.
► కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో సేవలు, తయారీ, మౌలిక రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే.
►భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ)లో సేవల రంగం వాటా దాదాపు 55 శాతంకాగా, తయారీ రంగం వాటా దాదాపు 15 శాతం.