![These two banks revise FD interest rates after RBI keeps monetary policy unchanged - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/11/FD-Rates.jpg.webp?itok=eKuUPMkh)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) రెపో రేటు(4 శాతం), రివర్స్ రెపో రేటు(3.35 శాతం)ను యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.
ఆర్‌బీఐ మానిటరరీ పాలసీ ఈ ప్రకటన చేసిన ఒక రోజు తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుసీఓ బ్యాంకులు రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాల ఫిక్సిడ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించాయి. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలకు వడ్డీ రేటును సవరించింది. ఈ కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ రేట్లు 2.75% నుంచి 5.15% మధ్య ఉన్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
యుకో బ్యాంక్
యుకో బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.10 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో డిపాజిట్ చేసే ఎఫ్‌డీలపై ఇతర సిటిజన్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు 0.50 బేసిసి పాయింట్స్ అధికంగా పొందనున్నారు.
యుకో బ్యాంక్ కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
Comments
Please login to add a commentAdd a comment