రూ.2,000 నోట్లను రద్దుచేయం: జైట్లీ
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను వెనక్కి తీసుకునే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభలో చెప్పారు. గత డిసెంబర్ 10 నాటికి ఆర్‌బీఐ కరెన్సీ చెస్టుల్లోకి తిరిగొచ్చిన పాత రూ.500, రూ.1000 నోట్ల విలువ రూ. 12.44 లక్షల కోట్లని వెల్లడించారు. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని ఆర్బీఐ వద్ద ఉన్న నగదు నిల్వలతో సరిపోల్చి, నకిలీ నోట్లు, అకౌంటింగ్ దోషాలు, డబుల్ కౌంట్లు లాంటి వాటిని తొలగించిన తరువాతే తుది గణాంకాలు తెలుస్తాయని వివరించారు. మార్చి 3 నాటికి చెలామణిలో ఉన్న నగదు విలువ రూ.12 లక్షల కోట్లని వెల్లడించారు.