ర్యాన్బాక్సీమాజీ ప్రమోటర్లకు వేలకోట్ల జరిమానా | Former Ranbaxy promoters Malvinder and Shivinder Mohan Singh fined Rs 2,600 cr for hiding facts from Daiichi | Sakshi
Sakshi News home page

ర్యాన్బాక్సీ మాజీ ప్రమోటర్లకు వేలకోట్ల జరిమానా

Published Thu, May 5 2016 4:28 PM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM

ర్యాన్బాక్సీమాజీ ప్రమోటర్లకు వేలకోట్ల జరిమానా - Sakshi

ర్యాన్బాక్సీమాజీ ప్రమోటర్లకు వేలకోట్ల జరిమానా

న్యూఢిల్లీ:  ర్యాన్బాక్సీ , జపాన్ ఔషధ సంస్థ డైచీ శ్యాంకో వివాదంలో ర్యాన్ బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు, సర్దార్ సోదరులకు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది.  మాజీ యజమానులైన  మల్వీందర్‌, శివిందర సింగ్‌ లకు  భారీ జరిమానా విధించింది.  ఆర్బిట్రేషన్ ఆఫ్ సింగపూర్ కోర్టు రూ 2,600 కోట్ల జరిమానా విధించింది. జపనీస్ ఔషధ సంస్థ   డైచీ శాంక్యో  నుంచి నిజాలు దాచి, తప్పడు  నివేదికలు అందించిన   కేసులో  ఈ తీర్పు వెలువరించింది.  2008లో ఇద్దరు సర్దార్జీ సోదరులు ర్యాన్‌బాక్సీ లో తమ వాటా 34 శాతాన్ని,  దైచీ శ్యాంకో కు  2.4 బిలియన్‌ డాలర్లకు విక్రయించడం వివాదానికి దారి తీసింది.  

అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్  ఆదేశాల నేపథ్యంలో 2013  మే లో  డైచీ ఆధ్వర్యంలోని రాన్‌బాక్సీ లాబరేటరీస్‌ అమెరికా ప్రభుత్వం మోపిన మోసం కేసుకు సుమారు 500 మిలియన్‌ డాలర్లు జరిమానా చెల్లించేందుకు ఒప్పుకుంది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ర్యాన్‌బాక్సీ ఔషధాలు నాణ్యమైనవి కావని నాసిరం మందులను తయారు చేస్తోందని తేల్చడంతో ఈ పరిణామం చేటు చేసుకుంది. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాలు సుమారు 30 వరకు ప్రమాణాలు పాటించడంలేదని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ తేల్చి చెప్పింది. ఈ ఔషధాలను అమెరికా మార్కెట్లో రద్దు చేసింది.  తమ సంస్థ నష్టాలకు, అమెరికా కోర్టు జరిమానాకు  పరిహారం  చెల్లించాల్సిందిగా  దాయిచీ 2013లో సింగపూర్ లో  మధ్యవర్తిత్వ కేసు దాఖలు చేసింది. భారతీయ ప్రమోటర్లు అవాస్తవాలతో తమను వంచించారని పేర్కొంది.

కాగా వాస్తవానికి ర్యాన్‌బాక్సీ గుట్టును రట్టు చేసింది మాత్రం కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి దినేశ్‌ ఠాకూర్‌. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాల నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని... కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా ఇది తెలుసునని... ఠాకూర్‌ ఆరోపించారు.ర్యాన్‌బాక్సీకి చెందిన శాస్త్రవేత్తలకు పనికిరానివి... చౌకగా దొరికే ముడిపదార్థాలను వినియోగించి ఔషధాలను తయారు చేయాల్సిందిగా యాజమాన్యం ఆదేశించేవారని ఆరోపించారు.  అమెరికా ఔషధ నియంత్రణా సంస్థను ర్యాన్‌బాక్సీ ఎలా మోసం చేసి తమ ఔషధాలను ఎలా ఆమోదించుకుందో ఠాకూర్‌ వివరాలతో సహా బహిర్గతం చేశారు. సంస్థ ఉద్యోగులే కంపెనీ  అసలు గుట్టురట్టు చేయడంతో డొంకంతా కదిలింది. అయితే ఇప్పటికే కంపెనీనుంచి బయటికి వచ్చిన సివిందర్ మోహన్ సింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక సంస్థ రాధా సాబి  బియాస్ లో చేరారు. అటు రాన్‌ బ్యాక్సీని కొనుగోలు చేసిన జపాన్‌ సంస్థ డైచీ శాంక్యోను 2014లో సన్‌ ఫార్మా విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement