న్యూఢిల్లీ: భారీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిజీత్ గ్రూప్ ప్రమోటర్లను సీబీఐ షాక్ ఇచ్చింది. ప్రధాన మైనింగ్ కంపెనీ నాగపూర్ కి చెందిన అభిజిత్ గ్రూపు ప్రమోటర్లు మనోజ్ జైస్వాల్, అభిషేక్ జైస్వాల్ సీబీ ఐ అరెస్ట్ చేసింది. దాదాపు రూ. 11 వేల కోట్ల భారీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ మంగళవారం అరెస్టులు చేపట్టింది. రూ. 290కోట్ల నష్టానికి పాల్పడిందనే అభియోగాలతో కెనరా బ్యాంక్ మాజీ డిజిపిని కూడా సిబిఐ అరెస్టు చేసింది.
అభిజిత్ గ్రూప్ కుచెంఇన 13 కంపెనీలు 20 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. తద్వారా 2014 నుంచి రూ.11,000 కోట్ల ఆస్తులు ఎన్‌పీఏలుగా మారడంతో సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. బ్యాంకుల్లో రుణాల ద్వారా అభిజిత్ గ్రూపు మనోజ్ జైస్వాల్, కెనరా బ్యాంకు మాజీ డిజిఎమ్ టి.బి.పాయ్‌లు కెనరా, విజయ బ్యాంకులకు రూ. 290 కోట్ల మేర నష్టం చేశారని సిబిఐ ప్రతినిధి ఆర్ కె గౌర్ చెప్పారు.
కాగా నేరపూరిత కుట్ర మరియు మోసం ఆరోపణలపై వీరిపై సీబీఐ 2015 లో కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకుకు రూ .18.85 కోట్లు, విజయా బ్యాంక్‌కు రూ .71.92 కోట్లు చెల్లించిందని సిబిఐ పేర్కొంది. 2011-13 సంవత్సరానికి క్రెడిట్ సదుపాయాల ద్వారా రూ.. 290.77(దాదాపు) కోట్లు అక‍్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఫిర్యాదుపై సీబీఐ ఈచర్యలు తీసుకుంది.
అభిజీత్ గ్రూప్ ప్రమోటర్ల అరెస్ట్
Published Tue, Jun 13 2017 2:57 PM | Last Updated on Mon, Aug 20 2018 4:37 PM
Advertisement
Advertisement