Shivinder Mohan Singh
-
శివిందర్ సింగ్ బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు స్వాధీనం
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ నిధుల మళ్లింపు కేసులో మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్, నాలుగు సంస్థలకు చెందిన బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను స్వాధీనం చేసుకోవాలని సెబీ ఆదేశించింది. వీరి నుంచి జరిమానా వసూలు చేసుకోవాల్సి ఉండడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ సబ్సిడరీయే రెలిగేర్ ఫిన్వెస్ట్. శివిందర్ మోహన్ సింగ్, మలవ్ హోల్డింగ్స్, ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, ఏఎన్ఆర్ సెక్యూరిటీస్, రెలిగేర్ కార్పొరేట్ సర్వీసెస్‌కు సంబంధించి ఎలాంటి డెబిట్ లావాదేవీలను అనుమతించొద్దని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలను సెబీ ఆదేశించింది. వీరికి సంబంధించి అన్ని ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాలని కోరింది. నిధులు మళ్లించిన కేసులో రూ.48 కోట్లను చెల్లించాలంటే ఈ నెల మొదట్లో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ మాజీ ప్రమోటర్లు మాల్విందర్ మోహన్ సింగ్, శివిందర్ మోహన్ సింగ్‌లను సెబీ ఆదేశించం గమనార్హం. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, మలవ్ హోల్డింగ్స్ అన్నవి రెలిగేర్ ఎంట్ర్ప్రైజెస్ మాజీ ప్రమోటర్ సంస్థలు. ఏఆర్ఆర్ సెక్యూరిటీస్, రెలిగేర్ కార్పొరేట్ సర్వీసెస్ అన్నవి ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌కు సబ్సిడరీలుగా ఉన్నాయి. -
భగ్గుమన్న విభేదాలు : కొట్టుకున్న బ్రదర్స్
ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు, ఒకప్పుడు బిజినెస్ టైకూన్లుగా వెలుగొందిన సింగ్ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ అండ్ రెలిగేర్ యజమానులు సింగ్ బ్రదర్స్‌గా చెప్పుకునే మల్విందర్ సింగ్, శివిందర్మోహన్ సింగ్ (55) తాజాగా రోడ్డెక్కారు. దీంతో ఇప్పటికే ఒకరిమీద ఒకరు ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచిన సోదరులిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ‘నువ్వు కొట్టావంటే.. నువ్వు కొట్టావంటూ’ ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా సాక్షిగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక పరమైన వివాదం కొత్త మలుపు తీసుకుంది. శివిందర్ తనపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడంటూ ఒక వీడియోలో మల్విందర్ ఆరోపించాడు. ఢిల్లీలోని హనుమాన్ రోడ్ కార్యాలయంలో డిసెంబర్ 5 ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నాడు. మరోవైపు శివిందర్.. అన్న మల్విందర్ ఆరోపణలను ఖండించాడు. ఇది అబద్ధమని, నిజానికి తనపైనే మల్విందర్ దాడి చేశాడని పేర్కొనడం గమనార్హం. ప్రియస్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గురిందర్ సింగ్ ధిల్లానుంచి తనకు రావాల్సిన 2వేల కోట్ల రూపాయలను రికవరీ చేసుకునేందుకు వెళ్లినపుడు మల్విందర్ అడ్డు పడ్డాడని ఆరోపించారు. మరోవైపు అన్నదమ్ముల ఘర్షణను ధృవీకరించిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇద్దరినీ శాంతింపచేసి, పోలీస్ ఫిర్యాదును ఉపసంహరింపజేసినట్టు సమాచారం. గత దశాబ్దకాలంగా రగులుతున్న వివాదం కారణంగా సింగ్ బ్రదర్స్ బద్ధశత్రువులుగా మారిపోయారు. అంతేకాదు సుమారు 22,500 కోట్ల రూపాయలను నష్ట పోయారు. ఈ నేపథ్యంలో సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మిసింగ్, ఇతర కుటుంబ పెద్దలు వీరి మధ్య వున్న వైరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ కేసులను తాత్కాలికంగా ఉపసహరించుకునేందుకు కూడా సమ్మతించారు. కానీ ఇంతలోనే మళ్లీ కథ మొదటికి వచ్చింది. తాజాగా ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్ సందర్భంగా (ఇద్దరూ బోర్డు సభ్యులు కాదు) గురువారం సాయంత్రం వీరిద్దరూ ముష్టిఘాతాలకు దిగారు. ఈ పరిణామంతో తమ ప్రతిష్టను మరింత దిగజార్చుకున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
అమ్మ కోరిక... పిటిషన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్... తన అన్న మల్వీందర్ మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎన్సీఎల్టీ అనుమతించింది. రెలిగేర్ మాజీ అధినేత సునీల్ గోధ్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకోవడానికి ఎన్సీఎల్టీ అనుమతించింది. తమ మధ్య ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కోరారని, వారి కోరిక మేరకు ఈ పిటి షన్లను వెనక్కి తీసుకుంటున్నానని శివిందర్ సింగ్ తెలిపారు. ఈ పిటిషన్ల ఉపసంహరణకు అనుమతించినందుకు ఆయన ఎన్సీఎల్టీకి ధన్యవాదాలు తెలిపారు. -
ర్యాన్బాక్సీమాజీ ప్రమోటర్లకు వేలకోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీ , జపాన్ ఔషధ సంస్థ డైచీ శ్యాంకో వివాదంలో ర్యాన్ బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు, సర్దార్ సోదరులకు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాజీ యజమానులైన మల్వీందర్, శివిందర సింగ్ లకు భారీ జరిమానా విధించింది. ఆర్బిట్రేషన్ ఆఫ్ సింగపూర్ కోర్టు రూ 2,600 కోట్ల జరిమానా విధించింది. జపనీస్ ఔషధ సంస్థ డైచీ శాంక్యో నుంచి నిజాలు దాచి, తప్పడు నివేదికలు అందించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. 2008లో ఇద్దరు సర్దార్జీ సోదరులు ర్యాన్‌బాక్సీ లో తమ వాటా 34 శాతాన్ని, దైచీ శ్యాంకో కు 2.4 బిలియన్ డాలర్లకు విక్రయించడం వివాదానికి దారి తీసింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాల నేపథ్యంలో 2013 మే లో డైచీ ఆధ్వర్యంలోని రాన్‌బాక్సీ లాబరేటరీస్ అమెరికా ప్రభుత్వం మోపిన మోసం కేసుకు సుమారు 500 మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించేందుకు ఒప్పుకుంది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) ర్యాన్‌బాక్సీ ఔషధాలు నాణ్యమైనవి కావని నాసిరం మందులను తయారు చేస్తోందని తేల్చడంతో ఈ పరిణామం చేటు చేసుకుంది. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాలు సుమారు 30 వరకు ప్రమాణాలు పాటించడంలేదని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ తేల్చి చెప్పింది. ఈ ఔషధాలను అమెరికా మార్కెట్లో రద్దు చేసింది. తమ సంస్థ నష్టాలకు, అమెరికా కోర్టు జరిమానాకు పరిహారం చెల్లించాల్సిందిగా దాయిచీ 2013లో సింగపూర్ లో మధ్యవర్తిత్వ కేసు దాఖలు చేసింది. భారతీయ ప్రమోటర్లు అవాస్తవాలతో తమను వంచించారని పేర్కొంది. కాగా వాస్తవానికి ర్యాన్‌బాక్సీ గుట్టును రట్టు చేసింది మాత్రం కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి దినేశ్ ఠాకూర్. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాల నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని... కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా ఇది తెలుసునని... ఠాకూర్ ఆరోపించారు.ర్యాన్‌బాక్సీకి చెందిన శాస్త్రవేత్తలకు పనికిరానివి... చౌకగా దొరికే ముడిపదార్థాలను వినియోగించి ఔషధాలను తయారు చేయాల్సిందిగా యాజమాన్యం ఆదేశించేవారని ఆరోపించారు. అమెరికా ఔషధ నియంత్రణా సంస్థను ర్యాన్‌బాక్సీ ఎలా మోసం చేసి తమ ఔషధాలను ఎలా ఆమోదించుకుందో ఠాకూర్ వివరాలతో సహా బహిర్గతం చేశారు. సంస్థ ఉద్యోగులే కంపెనీ అసలు గుట్టురట్టు చేయడంతో డొంకంతా కదిలింది. అయితే ఇప్పటికే కంపెనీనుంచి బయటికి వచ్చిన సివిందర్ మోహన్ సింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక సంస్థ రాధా సాబి బియాస్ లో చేరారు. అటు రాన్ బ్యాక్సీని కొనుగోలు చేసిన జపాన్ సంస్థ డైచీ శాంక్యోను 2014లో సన్ ఫార్మా విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.