అమ్మ కోరిక... పిటిషన్‌ ఉపసంహరణ | NCLT allows Shivinder Mohan Singh to withdraw plea | Sakshi
Sakshi News home page

అమ్మ కోరిక... పిటిషన్‌ ఉపసంహరణ

Published Sat, Sep 15 2018 2:36 AM | Last Updated on Sat, Sep 15 2018 2:36 AM

NCLT allows Shivinder Mohan Singh to withdraw plea - Sakshi

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్‌ శివిందర్‌ మోహన్‌ సింగ్‌... తన అన్న మల్వీందర్‌ మోహన్‌ సింగ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది. రెలిగేర్‌ మాజీ అధినేత సునీల్‌ గోధ్వానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకోవడానికి ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది.

తమ మధ్య ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కోరారని, వారి కోరిక మేరకు ఈ పిటి షన్లను వెనక్కి తీసుకుంటున్నానని శివిందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ పిటిషన్ల ఉపసంహరణకు అనుమతించినందుకు ఆయన ఎన్‌సీఎల్‌టీకి ధన్యవాదాలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement