
మరోసారి సత్తా చాటిన మారుతి
న్యూఢిల్లీ: దేశీ కార్ల దిగ్గజం మారుతి సుజుకి క్యూ2 నికర లాభాలు భారీగా జంప్ చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను అధిగమించి ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబరు తో ముగిసిన క్యూ 2 లో నికర లాభాలు 60.18 శాతం వృద్ధితో రూ 2,398 కోట్లను ఆర్జించింది. గత జూలై-సెప్టెంబర్ కాలంలో,రూ 1,497 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 29.28 శాతం పుంజుకుని రూ. 20,297 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ 15,699.7 కోట్లగా ఉంది. ఇతర ఆదాయం రూ. 474 కోట్ల నుంచి రెట్టింపై రూ. 813 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా) 35 శాతం జంప్‌చేసి రూ. 3037 కోట్లుగా నమోదు చేసింది ఇబిటా మార్జిన్లు 14.3 శాతం నుంచి 14.96 శాతానికి బలపడినట్టు మారుతి సుజుకి ఇండియా బీఎస్ఈకి తెలిపింది. మొత్తం 4,18,470 వాహనాల విక్రయంతో 18.4 శాతం పెరుగుదలను సాధించినట్టు తెలిపింది.
ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారి నాటి మార్కెట్ లో మారుతి సుజుకి షేర్లు రూ 5,932 వద్చద రిత్రాత్మక గరిష్టాన్ని నమోదుచేసింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో 0.87 శాతం క్షీణించి రూ. 5,818 వద్ద వద్ద ట్రేడవుతున్నాయి.