జీఎస్‌టీ మండలికి కేబినెట్ ఆమోదం | Cabinet approval of the Board of GST | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 13 2016 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను అమలు చేసే పనిని వేగవంతం చేస్తూ.. జీఎస్‌టీ మండలి ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. జీఎస్‌టీ మండలి సచివాలయానికి కూడా ప్రధానిమోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఆర్థిక మంత్రి అధ్యక్షతన జరిగే తొలి భేటీలో ఆర్థిక శాఖ సహాయమంత్రి, కేంద్ర రెవెన్యూ విభాగం ఇన్‌చార్జ్, రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొని పన్ను రేటు, ఇతర ముఖ్య అంశాలపై చర్చించనున్నారు. నవంబర్ 22 లోగా పన్ను రేటు, మినహాయింపు వస్తువులు, అమలు తేదీని జీఎస్‌టీ మండలి నిర్ణయిస్తుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement