ఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఢిల్లీలో కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్ట తీసుకురానుంది. ఈ చట్టం రూపకల్పన కోసం ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో ఓ కమిటిని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం తీసుకవచ్చే చట్టంలో మౌలిక వసతులు, టీచర్ల విద్యార్హత, ఫీజు నిబంధనలు, తప్పుదోవ పట్టించే కోచింగ్ సెంటర్ల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. చట్ట రూపకల్పన ప్రజల నుంచి కూడా సూచనలు, సలహాలు స్వీకరిస్తాం.
..బిల్డింగ్ బేస్‌మెంట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్( డీఎంసీ) కఠిన చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే రాజేంద్రనగర్, ముఖర్జీ నగర్, లక్ష్మీ నగర్, ప్రీత్ విహార్‌లో ఉన్న బేస్‌మెంట్లను కలిగి ఉన్న 30 కోచింగ్ సెటర్లను సీజ్ చేశాం. మరో 200 కోచింగ్ సెంటర్లకు డీఎంసీ అధికారులు నోటీసులు పంపారు. ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును ఆరు రోజుల్లో సమర్పిస్తాం. ఈ ఘటనలో మున్సిపల్ అధికారులు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం’అని అతిశీ తెలిపారు.
ఇటీవల ఢిల్లీలోని రాజేంద్రనగర్ ఉన్న రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన విషయంతెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment