
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో కోచింగ్ బోర్డులను ఈ నెలాఖరు కల్లా తొలగించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐవో గుంటుక రమణారావు స్పష్టం చేశారు. శనివారం తన కార్యాలయంలో ఆయన వీటి విధి విధానాలపై వివరించారు. కళాశాల నేమ్ బోర్డుపై కేవలం కళాశాల పేరు, అనుమతి ఉన్న గ్రూపులు, విద్యార్థుల సంఖ్యను మాత్రమే ఉండాలి, నేమ్ బోర్డు తెలుపు రంగులోనూ, నీలం రంగులో అక్షరాలు ఉండాలని సూచించారు. పాత బొర్డులను తొలగించకపోతే మొదటి అపరాధ రుసుంగా రూ.10 వేలు, పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయమై ఇటీవలి ప్రైవేటు, కార్పోరేట్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆదేశించినట్టు పేర్కొన్నారు.
మార్కులు, గ్రేడింగ్ ప్రచారం చేస్తే చర్యలు
ఇంటర్మీడియెట్ మార్కులు, గ్రేడింగులు ప్రచా రం చేస్తే చర్యలు తప్పవని ఆర్‌ఐవో తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులకు రూ.4,470 మాత్రమే ఫీజుగా వసూలు చేయాలన్నారు. కళాశాలల్లో హాస్టళ్లు నిర్వహిస్తే అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇంటర్æ విద్యార్థులకు బోర్డు నిర్దేశించిన పరీక్ష ఫీజులు మాత్రమే వ సూలు చేయాలని, అదనంగా వసూలు చేస్తే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment