road accident in delhi
-
ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొత్త ఏడాది తొలిరోజే ఓ యువతి దారుణంగా హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తప్పతాగిన ఐదుగురు దుండగులు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ దారుణ సంఘటన ఢిల్లీ సుల్తాన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున తన స్కూటర్‌పై వెళ్తోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్రెస్ కారు టైరులో చిక్కుకుంది. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ ఆగకుండా కారును ముందుకు నడిపారు. టైరులో డ్రెస్ చిక్కుకోవడంతో సుమారు 4 కిలోమీటర్లు ఆ బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలపై ఆ యువతి మృతి చెందింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా యువతి మృతదేహం కనిపించటం కలకలం సృష్టించింది. రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి ముందుగా హత్యాచారంగా భావించారు. కానీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు వెనకాల ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం సమచారం అందినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఓ మహిళ మృతదేహాన్ని బలెనో కారుకు కట్టి ఈడ్చుకెళ్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. కంఝవాలా పోలీస్ స్టేషన్ బృందం ఈ విషయంపై ఆ కాలర్‌కు తిరిగి పలు మార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత బలెనో కారును ఆ వ్యక్తి గుర్తించాడు.’ అని తెలిపారు. ఫోన్ రాగానే పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. రోహిణి జిల్లా క్రైమ్ టీం సైతం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తర్వాత కారును పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగినట్లు వారు తెలిపారు. మహిళా కమిషన్ నోటీసులు యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మాలివాల్. ‘ఢిల్లీ కంఘావాలా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. కొందరు యువకులు తప్పతాగి ఆమె స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను పలు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేస్తున్నా.’అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు -
డివైడర్‌పై నిద్రించటమే వారికి శాపంగా మారింది.. ట్రక్కు దూసుకెళ్లి..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలువ నీడలేని కొందరు రోడ్డు మధ్యలోని డివైడర్‌పై నిద్రించటమే వారికి శాపంగా మారింది. సీమాపురి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓ ట్రక్కు అతవేగంతో డివైడర్‌పై పడుకున్న వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఢిల్లీ రవాణా సంస్థ(డీటీసీ) బస్ డిపోకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు.. కరీం(52), ఛోటే ఖాన్(25), షా అలాం(38), రాహు(45)లుగా గుర్తించారు. మరో ఇద్దరు మనీశ్(16), ప్రదీప్(30)లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత ఆగకుండా ట్రక్కుతో సహా పారిపోయాడు డ్రైవర్. నిందితుడుని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదీ చదవండి: స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి! -
అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్..
తనకే కారు ఉందని రెచ్చిపోయాడు.. రోడ్డు మీద స్పీడ్ పెంచి కారు నడిపి.. బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడగా.. పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక.. ట్విస్ట్ ఏంటంటే అతనో ‘లా’ విద్యార్థి కావడం విశేషం. వివరాల ప్రకారం.. అర్జంఘర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ బైకర్, కారు డ్రైవర్ల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్కార్పియో డ్రైవ్ చేస్తున్న అనుజ్ చౌదరి.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్న శ్రేయాన్ష్‌ను హై స్పీడ్‌లో కారుతో ఢీకొట్టాడు. అంతకు ముందు బైకర్‌ను బూతులు తిడుతూ.. కారుతో తొక్కించి చంపేస్తానంటూ బైకర్లను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఓ బైకర్‌ను వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టాడు. కారు ఢీకొట్టడంతో కింద పడిపోయిన బైకర్.. శ్రీయాన్ష్ తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను అనురాగ్ అయ్యర్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అనంతరం, పీఎంవో ఇండియా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీసీపీ న్యూఢిల్లీలను ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు శ్రేయాన్ష్ మాట్లాడుతూ.. తాను, తన స్నేహితులు కలిసి ఆరావళిలోని టెంపుల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న అనుజ్‌తో వాగ్వాదం జరిగిందన్నాడు. ట్విట్టర్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుజ్ చౌదరిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కారును సీజ్ చేసినట్టు చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @PMOIndia @ArvindKejriwal @DCPNewDelhi Please help us , the Scorpio Car driver almost killed a few of our riders and threatened to kill us by crushing us under the car. This is not what we vote for or pay taxes for no one was severely injured Gears respect riders pic.twitter.com/rcZIZvP7q4 — ANURAG R IYER (@anuragiyer) June 5, 2022 ఇది కూడా చదవండి: మ్యూజియం పై దాడి చేసిన యువకుడు... కారణం విని షాక్ అయిన పోలీసులు -
వాహనదారులకు భారీ షాక్..ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష!
వాహనదారులకు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ప్రైవేట్, ప్రభుత్వ వాహనాల యజమానులకు రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష విధిస్తున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వస్తున్నారు. అదే సమయంలో వాహనాల రాకపోకళ్లు పెరిగి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ - గురుగ్రావ్ మార్గాల్లో 2020లో 347 మంది, 2021లో 10శాతం పెరిగి 389 మంది రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2020లో 375 మంది తీవ్రంగా గాయపడగా.. 2021లో 409 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఈ వరుస ప్రమాదాల నుంచి వాహనదారుల్ని కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేని వాహనాల్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో "ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది మోటారు వాహనాల (ఎంవీ) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని రవాణా శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌లో పేర్కొంది. అందుకే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నట్లు ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరైన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా వాహనాల్ని నడిపే వాహనదారులకు మొదటి తప్పుకు రూ. 2,000-5,000, రెండవ, మూడవ నేరం కింద రూ.5,000-10,000 జరిమానా విధిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో యజమాని లేదా డ్రైవర్‌కు జైలు శిక్ష విధించే నిబంధన కూడా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు విడుదల చేసిన నోటీస్‌లో హైలెట్ చేశారు. ఇ-రిక్షాలు, ఇ-కార్ట్స్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం, ఫిటెనెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్! -
మెరిసే కళ్లు.. ఆ చిరునవ్వు మాయం..రేణూ మిస్ యూ
సాక్షి, న్యూఢిల్లీ : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ది ప్రింట్ హిందీ ఎడిటర్ , సీనియర్ మహిళా జర్నలిస్టు రేణు అగల్ ఇకలేరు. డిల్లీకి చెందిన రేణు అగల్ దాదాపు నెల రోజుల పాటు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. దీంతో పాత్రికేయ మితృలందరూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసుకుని, మంచి మనిషిగా ఎపుడూ నవ్వుతూ, నలుగురికి సాయపడుతూ ఉండే రేణు అకాలమరణం పత్రికా ప్రపంచానికి తీరని లోటంటూ విచారం వ్యక్తం చేశారు. ఆ నవ్వులిక మాయమంటూ రేణు సన్నిహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీబీసీ ఆన్లైన్ ఎడిటర్ గీతా పాండే రేణు మృతిపై సంతాపం ప్రకటించారు. మార్చి 25 న రేణు అగల్ విధులను ముగించుకొని రిక్షాలో ఇంటికి వెళుతుండగా డీఆర్డీఓ అధికారి తప్పతాగి మద్యం మత్తులో అతివేగంగాకారుతో ఢీకొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కానిస్టేబుల్ అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన ఏడు రోజుల తరువాత రిక్షా డ్రైవర్ చాంద్ కూడా చనిపోయాడు. వాహనంపై నియంత్రణ కోల్పోయిన జిగ్ జాగ్గా ప్రయాణిస్తూ మొదట ఒక వ్యక్తిని కొట్టాడు. అనంతరం సైకిల్-రిక్షాపైకి దూసుకెళ్లాడని కానిస్టేబుల్ తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో రిక్షాలో కూర్చున్న మహిళ కింద పడిపోయారనీ, స్థానికుల సాయంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతను పారిపోయాడని తెలిపారు. నిందిత డ్రైవర్‌ను కాళి బారి మార్గ్ నివాసి గౌరవ్ బాత్రాగా గుర్తించినట్లు డీసీపీ (ఉత్తర) అల్ఫోన్స్ తెలిపారు. అతనిపైకేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా రేణు అగల్ 1996 లో బీబీసీ లండన్‌లో పనిచేశారు. ప్రత్యేక కరస్పాండెంట్‌గా సుదీర్ఘకాలం15 ఏళ్లు పని చేశారు. 2011 లో పెంగ్విన్ బుక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో కమిషనింగ్ ఎడిటర్‌గా చేరారు. ఆ తరువాత 2018 లో సీనియర్ ఎడిటర్‌గా ది ప్రింట్ హిందీ టీం చేరడానికి ముందు 2015 లో జగ్గర్నాట్ బుక్స్‌కు పనిచేశారు. So shocking. RIP. Deepest condolences to family, friends — Shantanu Nandan Sharma (@shantanunandan2) April 22, 2021 -
చిన్నారితో సహా కుటుంబాన్ని కబళించిన లారీ
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం కేవిపల్లి మండలంలోని గ్యారంపల్లి కస్పా వద్ద ఈ ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి వైపు వెళ్తున్న ఓ మోటార్ బైక్ అదే మార్గం నుంచి వెళుతున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో రెండేళ్ల చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు చిన్న గొట్టిగల్లుకు చెందిన శంకరప్ప, హారిక, చిన్నారి లిల్లీగా పోలీసులు గుర్తించారు. (ఐదుగురు స్నేహితులను బలిగొన్న అతివేగం ) -
ఢిల్లీలో రోడ్డుప్రమాదం: ప్రకాశం జిల్లా వాసుల మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన యాత్రికుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్రా-యమున ఎక్స్‌ప్రెస్ వేపై నిద్రమత్తులో ఉన్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా అద్దంకి సమీప గ్రామాలకు చెందిన 40 మంది యాత్రికులు ఉత్తరాది యాత్రలకు బయలుదేరారు. ఢిల్లీ, ఆగ్రాతో పాటు షిర్డి దర్శించకుని స్వగ్రామాలకు చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అనూహ్యంగా రోడ్డుప్రమాదం జరగడంతో యాత్రికులు అక్కడ నుంచి మరో బస్సులో స్వగ్రామాలకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. మృతి చెందిన ఇద్దరినీ కొటికలపూడి గ్రామానికి చెందని వారిగా గుర్తించారు. క్షతగాత్రులను కైలాష్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఢిల్లీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.