
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం కేవిపల్లి మండలంలోని గ్యారంపల్లి కస్పా వద్ద ఈ ప్రమాదం జరిగింది. పీలేరు నుంచి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి వైపు వెళ్తున్న ఓ మోటార్ బైక్ అదే మార్గం నుంచి వెళుతున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో రెండేళ్ల చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు చిన్న గొట్టిగల్లుకు చెందిన శంకరప్ప, హారిక, చిన్నారి లిల్లీగా పోలీసులు గుర్తించారు. (ఐదుగురు స్నేహితులను బలిగొన్న అతివేగం )
Comments
Please login to add a commentAdd a comment